365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,ఆగస్టు 24,2021:ప్రపంచాన్ని అంగీకరించవడం తప్పనిసరి అయితే, మీరు దేన్ని ఎంచుకుంటారు? హిందీ,తమిళ భాషల్లో బ్లాక్ బస్టర్‌లతో సంచలనాన్ని సృష్టించిన డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త, సబ్‌స్క్రైబర్‌లుగా కొనసాగుతున్న వారి కోసం తన మొట్టమొదటి భారీ-టికెట్ తెలుగు సినిమా మాస్ట్రోను అందుబాటులోకి తీసుకు వస్తోంది. నితిన్,తమన్నా,నభా నటేష్ తదితర అత్యంత ప్రతిభావంతులైన తారాగణాన్ని కలిగి ఉన్న మాస్ట్రో సినిమా, ఆయుష్మాన్ ఖురానా, టబు,రాధికా ఆప్టే నటించిన అంధాధున్‌కు అధికారిక రీమేక్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మాస్ట్రో కథాంశాన్ని అవలోకిస్తే, తనకు తెలియని నేరం గురించి ఫిర్యాదు చేయవలసిన సంకట స్థితిలో చిక్కుకున్న అంధుడైన పియానిస్ట్ జీవిత ప్రయాణాన్ని మార్చివేసే అనేక రహస్య సంఘటనలను అన్వేషిస్తుంది. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, మేర్లపాక గాంధీ అద్భుతమైన దర్శకత్వంలో నిర్మించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను వినోదాత్మకమైన రైడ్‌లోకి తీసుకెళ్లడం ఖాయం. డిస్నీ+ హాట్‌స్టార్ త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.
అంధాధున్ లాగా, మాస్ట్రో థీమ్ అబద్ధాల చుట్టూ తిరుగుతూ,అవి సమస్యలుగా ఎమారతాయో చూపిస్తుంది .ట్రైలర్‌లో దృష్టిలోపం ఉన్న ఒక సామాన్యుడు, ఒక హత్య కేసులో చిక్కుకుని,తనను తాను రక్షించుకునే పరిస్థితి నుంచితప్పించుకునేందుకు చేసిన అతని ప్రయత్నాల ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపిస్తుంది. ఈ సినిమాలో మొదటిసారిగా, రొమాంటిక్ పాత్రలను పోషించడంలో చక్కని గుర్తింపు ఉన్న ప్రసిద్ధ నటుడు నితిన్ కృష్ణ హాస్య ప్రధానమైన పాత్రలో కనిపిస్తారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ, “మాస్ట్రో సినిమా తీస్తున్నప్పుడు, మేము మేము కథాంశాన్ని అంధాధున్ మాదిరిగానే ఉంచాలని అనుకుంటున్నామని మాకు తెలుసు. ఊహించని మలుపులతో,తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ నిర్మాత ప్రయత్నించని, గట్టి పట్టున్న కథను తెలుగు ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాము. మా ప్రేక్షకులు ఈ గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఇష్టపడతారు,డార్క్ కామెడీ జానర్‌ని అన్వేషిస్తున్న వారికి ఈ చిత్రం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. దీని కథలో ప్రతి పాత్ర,వాటి ప్రయాణం ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా చేసేందుకు,అంతటా వారు సీట్లకు అంటిపెట్టుకుని చివరి వరకు వీక్షించేలా చేస్తాయి’’ అని పేర్కొన్నారు.
మాస్ట్రోలో తన పాత్ర గురించి మాట్లాడుతూ, నటుడు నితిన్ మాట్లాడుతూ, “అంధాధున్‌లో ఆయుష్‌మాన్ తన పాత్రను పోషించిన తీరుకు నేను అభిమానిగా మారిపోయాను. తన నటనా కౌశల్యంతో సస్పెన్స్‌ను సజీవంగా ఉంచారు. నాకు మాస్ట్రో సినిమా చేసే అవకాశం లభించినప్పుడు,సినిమాలో నా పాత్ర సంక్లిష్టత, మేర్లపాక గాంధీతో చేయడం వల్ల అనుభవాన్ని మరింతపెంచుకునేందుకు నేను పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని నాకు తెలుసు. సినిమాలోని పాత్రల పట్ల ఆయనకు స్పష్టమైన దృష్టి కోణం ఉంది. ప్రేక్షకులు తమ మనసుకు హత్తుకునే, ఉత్కంఠతో సీట్లలో కూర్చుని చూసే సినిమాలను చూసేందుకు ఎక్కువ ఇష్టపడతారు; మాస్ట్రోతో, మేము దానిని సాధించామని మేము వివ్వసిస్తున్నాము. డిస్నీ+ హాట్‌స్టార్‌లో త్వరలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారని తెలుసుకోవడం మాకు సంతోషంగా ఉంది’’ అని తెలిపారు.
నటి తమన్నా మాట్లాడుతూ,“డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాస్ట్రో ప్రదర్శనకు సిద్ధంగా ఉందని తెలుసుకుని, ఉత్కంఠకు గురయ్యాను!నేను బహుముఖ పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతాను,మాస్ట్రోలో,నేను నటిగా నా పరిధిని మరోసారి విస్తరించుకునేందుకు ప్రయత్నించాను. తెరపై ప్రతినాయకి ఛాయలు ఉన్న పాత్రను పోషించడం ప్రతిసారీ సవాలుగానే ఉంటుంది ఎందుకంటే, ఇది మీ సరిహద్దులను అధిగమించి నటించవలసి ఉంటుంది. కానీ నేను ఇలాంటి సవాళ్లను పూర్తిగా ప్రేమిస్తాను! గతంలో నేను ఇటువంటి పాత్రను పోషించలేదు! నా పాత్రను ఊహించుకునేలా దర్శకుడు మేర్లపాక గాంధీ చక్కని మార్గదర్శకత్వం చేశారు. ఈ పాత్రను ఇప్పటికే అంధాధున్‌లోటబుపోషించినప్పటికీ, నేను ఈ పాత్రను నాదైన విధానంలో అర్థం చేసుకున్నాను,ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.
సారాంశం: గోవాలో ప్రతిభావంతుడైన పియానిస్ట్‌గా గుర్తింపు ఉన్న అరుణ్ ఒక రహస్యాన్ని గుట్టుగా
ఉంచుతాడు. తన పియానో నైపుణ్యాలను మెరుగుపర్చుచుకునేందుకు, అందరినీ ఆకట్టుకునేందుకు అంధునిగా వ్యవహరిస్తూ ఉండు. అందమైన సోఫీతో మొదలైన పరిచయం, ఆమె అతనికి తన తండ్రి భోజనశాలలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఒక విందులో అరుణ్‌ను ప్రముఖ మాజీ నటుడు మోహన్ అతని ప్రతిభను చూసి, ఒక ప్రత్యేక సందర్భంలో తన ఇంట్లో పియానో ప్రదర్శనకు రావాలని ఆహ్వానిస్తాడు. అరుణ్ ఆ నటుని ఫ్లాట్‌కి వచ్చిన తర్వాత మోహన్ భార్య సిమి తలుపు తెరుస్తుంది. అరుణ్ అనాలోచితంగా తాను చూడకూడని నేరానికి సాక్షి అవుతాడు. అరుణ్ నేరాన్ని
పోలీసులకు వివరంచేందుకు ప్రయత్నించగా, కానీ అది తన అసత్యాలను కూడా బహిర్గతం చేస్తుందని,
తనకు ఎక్కువ ముప్పును కలిగిస్తుందని తెలుసుకుని షాక్‌కు గురవుతాడు. నేరాలు,మోసాల
వలయంలో చిక్కుకున్న అరుణ్‌కు క్యాచ్22 పరిస్థితిని ఎదుర్కొంటాడు.దీనిలో నవ్వుతో పాటు థ్రిల్ కూడా ముడిపడి ఉంటుంది.నితిన్, తమన్నా,నభా నటేష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మాస్ట్రో చిత్రాన్నిడిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే త్వరలో ప్రదర్శించనున్నారు