Sat. Jan 4th, 2025

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 1,2025: భారతీయుల జీవితంలో చాయ్ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. చాలామందికి ఇది ప్రేమించే పానీయం మాత్రమే కాదు, ఏకంగా వారి జీవితంలో ఒక భాగంమైన పానీయం. చాయ్ తాగే విషయంలో కొందకి మిగిలిన చాయ్‌ను మళ్లీ వేడి చేసి తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగిలిన చాయ్‌ను మళ్లీ వేడి చేయడం వల్ల కలిగే నష్టాలను గురించి తెలుసుకుందాం.

ఎందుకు మళ్లీ వేడి చేస్తారు?

కొంతమందికి మళ్లీ చాయ్ వేడి చేయడం వల్ల గ్యాస్‌, డబ్బు పొదుపు అవుతుంది. కానీ, దీనివలన కలిగే ప్రమాదాలు అధికమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

మళ్లీ వేడి చేసిన చాయ్ వల్ల దుష్ప్రభావాలు..

రుచి ఉండదు..
మళ్లీ వేడి చేసిన చాయ్ కొత్తగా తయారుచేసిన వాటిలా సువాసన, రుచి ఉండవు. ఇలాంటి చాయ్‌ను తాగడానికి మనసు కూడా అంగీకరించదు.

బ్యాక్టీరియా..

4 గంటలకంటే ఎక్కువ సమయం మిగిలి ఉన్న చాయ్‌లో సూక్ష్మజీవులు (ఫంగస్‌, బ్యాక్టీరియా) పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పాలు కలిపిన చాయ్‌లో వీటి వృద్ధి వేగంగా జరుగుతుంది.

ఆరోగ్య సమస్యలు..

మళ్లీ వేడి చేసిన చాయ్ తాగడం వల్ల ద్రవం విషరూపం దాల్చుతుంది. దీని వల్ల పేగు సమస్యలు, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.

టానిన్ విడుదల..

ఎక్కువసేపు నిల్వ ఉన్న చాయ్ నుంచి టానిన్ విడుదలవుతుంది. దీని వల్ల చాయ్ రుచి చేదుగా మారుతుంది.

చాయ్‌ను వేడి చేయడంలో జాగ్రత్తలు..

చాయ్ తయారైన 15 నిమిషాల లోపే వేడి చేయాలి.
4 గంటలకంటే ఎక్కువ నిల్వ ఉన్న చాయ్‌ను అస్సలు వేడి చేయకూడదు.
అవసరానికి తగినంతగా మాత్రమే చాయ్ తయారు చేయాలి.

నిపుణుల సూచన..

మళ్లీ వేడి చేసిన చాయ్ తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కావున, టీని తగిన జాగ్రత్తలతో మాత్రమే తీసుకోవాలి.

ముఖ్య గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం మీకు జస్ట్ ఎవేర్ నెస్ కోసం మాత్రమే. ఆరోగ్య సంబంధిత సమస్యలకు సంబంధించి లేదా చికిత్స అవసరమైతే, తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.

error: Content is protected !!