365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఢిల్లీ ,డిసెంబర్ 29,2022:టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తన వ్యాపార విజయాలు,దాతృత్వ కార్యక్రమాల గురించి మాత్రమేఅందరికీ తెలుసు.
85 ఏళ్ల రతన్ టాటా కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. మిలియన్ల మంది ప్రజలు ఆయనను ఆదర్శంగా భావిస్తారు.
రతన్ టాటా విజయాలు అందరికీ తెలిసినప్పటికీ, వ్యాపారవేత్త వ్యక్తిగత జీవితం గురించి మనలో చాలా మందికి తెలియదు. రతన్ టాటా ప్రేమ వ్యవహారం గురించి ఎవరికీ తెలియదు.
రతన్ టాటా ఎవరినీ పెళ్లి చేసుకోలేదని, అయితే అతను తన యవ్వనంలో ఒకసారి ప్రేమలో పడ్డానని, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడని ఒకసారి వెల్లడించాడు.
తన లవర్ కోసం కాకుండా ఆ తర్వాత టాటా గ్రూప్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు తన సమయాన్ని, శక్తిని వెచ్చించాలని నిర్ణయించుకున్నానని రతన్ టాటా తెలిపారు.
నివేదిక ప్రకారం, రాటా టాటా లాస్ ఏంజిల్స్‌లో ఆర్కిటెక్చరల్ సంస్థలో పనిచేస్తున్నప్పుడు యువకుడిగా ఉన్నప్పుడు ఒక మహిళను కలిశాడు.
టాటా ఆ మహిళతో ప్రేమలో పడ్డాడని, ఆమెతో నే తన జీవితాన్ని పంచుకోవాల ని భావించాడని సమాచారం.
అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన అమ్మమ్మను చూసుకునేందుకు రతన్ టాటా భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.
టాటా ఆ మహిళను తనతో పాటు భారతదేశానికి తీసుకెళ్లాలని అనుకున్నాడు కానీ 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా ఆమె తల్లిదండ్రులకు తమ కుమార్తెను ఇండియాకు తీసుకెళ్లడం నచ్చలేదు.
దీంతో వారిద్దరిమధ్య గ్యాప్ పెరిగింది. రతన్ టాటా ఆ మహిళ గురించి ఎక్కడా వెల్లడించలేదు. అతను మరెవరినీ వివాహం చేసుకోలేదు.
రతన్ టాటా భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ గ్రహీత.
ప్రస్తుతం టాటా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసి అనేక ఛారిటబుల్ ట్రస్ట్‌లకు నాయకత్వం వహిస్తున్నారు రతన్ టాటా.