Tue. Jul 9th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఇండియా,జూన్ 13,2023:దేశవ్యాప్తంగా వాహనాల విక్రయాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్యాసింజర్ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు సహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదు అవుతోంది.SIAM ప్రకారం, మే 2023లో ఎన్ని వాహనాలు అమ్మడుపోయాయో తెలుసా..

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ద్వారా మే నెలలో మొత్తం వాహన విక్రయాలలో పెరుగుదల నమోదు చేశారు. సియామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మే నెలలో మొత్తం 18,086,86 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. ఇందులో ప్యాసింజర్ వాహనాలు, త్రీ వీలర్స్, టూ వీలర్స్ ఉన్నాయి. సంవత్సరానికి సంబంధించిన డేటా ప్రకారం, మే 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 15,32,861 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఏ విభాగంలో ఎన్ని విక్రయాలు

SIAM నివేదిక ప్రకారం, మే 2023లో, ప్యాసింజర్ వాహన విభాగంలో 2,88,369 యూనిట్లుఅమ్మకాలు జరిగినవి. మే 2022లో ఈ సంఖ్య 2,51,051గా ఉంది. ద్విచక్ర వాహనాల విభాగంలో, మే 2023లో మొత్తం మోటార్‌సైకిల్ అమ్మకాలు 9,89,120 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 4,46,593 యూనిట్లు,మోపెడ్ అమ్మకాలు 35,837 యూనిట్లుగా ఉన్నాయి. అదే సమయంలో, మూడు చక్రాల వాహనాల అమ్మకాల మొత్తం సహకారం 48,732 యూనిట్లు.

ఎంత పెరుగుతుంది

మే 2023లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 13.5 శాతం వృద్ధి నమోదైందని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. ద్విచక్ర వాహనాల విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే 17.4 శాతం వృద్ధిని సాధించగా, మే నెలలో త్రీవీలర్ విక్రయాలు 70.4 శాతం పెరిగాయి.

ఉత్పత్తి..

మే 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 345567 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు ఉత్పత్తి కాగా, 2022 సంవత్సరంలో మే నెలలో 2,96,841 యూనిట్లు ఉత్పత్తి అయ్యాయి. మే 2023లో, 17,06,654 ద్విచక్ర వాహనాలు తయారు చేయగా, మే 2022లో ఈ సంఖ్య 16,08,914 యూనిట్లుగా ఉంది. అదే సమయంలో, మే 2023లో, మొత్తం 71,649 యూనిట్ల త్రీ వీలర్లు తయారు చేసారు.