365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై ,జనవరి18, 2023: అభిరుచి అనేది ఒక్కొక్కరిదీ ఒక్కొక్కవిధంగా ఉంటుంది. కొందరికి పెర్ఫ్యూమ్‌లు సేకరించడం అంటే ఇష్టం, మరికొందరికి బట్టలంటే ఇష్టం.
చాలా మంది ధనవంతులు వాహనాలు, బైక్‌ల సేకరించడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన బ్యాగ్స్ సేకరిస్తుంటారు. ఆ జాబితాలో కరీనా కపూర్ ఖాన్ ముందు వరసలో నిలుస్తారు. ఆమె తనకు ఇష్టమైన లగ్జరీ బాగ్స్ కలెక్ట్ చేస్తుంటారు .
కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కూడా ఉంటారు. ఆమె స్టైల్, ఫ్యాషన్ సెన్స్ కారణంగా, ఆమె ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తుంటారు. కరీనా కపూర్ ఖాన్ ఖరీదైన వాహనాలను ఇష్టపడుతుంది.

అయితే దీనితో పాటు ఆమె అలాంటి లగ్జరీ బ్యాగ్స్ కలెక్ట్ చేస్తుంటారు. వీటిని కొనడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఇవన్నీ విదేశీ బ్రాండ్ బ్యాగులు. కరీనా ఈ లగ్జరీ బ్యాగ్స్ గురించి తెలుసుకుందాం
లూయిస్ విట్టన్ బ్యాగ్..
కరీనా తరచుగా ఈ కంపెనీ బ్యాగులనే ఎక్కువగా వాడుతుంటారు. ఇటీవల ఆమె రూ. 3.5 లక్షలు ఖరీదు చేసే బ్లూ కలర్ లూయిస్ విట్టన్ బ్యాగ్ ను కొనుగోలు చేశారు.
డియోర్ బాబీ బ్యాగ్..
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా హౌస్ పార్టీలో డియోర్ బాబీ బ్యాగ్ తో కరీనా కనిపించారు. ఈ బ్యాగ్ ధర రూ.2.8 లక్షలు.
Balenciaga నియో క్లాసిక్ హ్యాండ్‌బ్యాగులు..
కరీనాతో పాటు ఈ కంపెనీ బ్యాగులు కరిష్మా కపూర్ వద్ద ఉన్నాయి. దీని ధర 2.2 లక్షలు. లూయిస్ విట్టన్ మోనోగ్రామ్ ఎక్లిప్స్ బాక్స్ క్లచ్. దీని ధర 2.1 లక్షలు.