365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి13, 2023: టైం ప్రకారం ఆహరం తీసుకోకపోతే పలురకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. లేకుంటే అజీర్తి, రక్తహీనత, పోషకాహార లోపం, గుండెల్లో మంట, కడుపు నొప్పి, బరువు, కండరాలు, ఎముకలు, నిద్ర లేని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇదే విషయం పలు రకాల పరిశోధనల్లో తేలింది. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆయుష్షు కూడా తగ్గుతుంది. అంతేకాదు దీర్ఘకాలిక రోగాల బారీన పడాల్సి వస్తుంది. భోజనం చేసిన తర్వాత కనీసం 4 నుంచి5 గంటల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి.