365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూలై 9,2025: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశ కేంద్ర బ్యాంకు, ఇది బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ. ఇది దేశంలోని అన్ని బ్యాంకులకు నియమాలను రూపొందిస్తుంది. వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను కూడా నిర్ణయిస్తుంది. ఇది బ్రిటిష్ కాలంలో స్థాపించారు.
హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా, దేశం కరెన్సీ, క్రెడిట్‌ను నియంత్రించడానికి రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 కింద స్థాపించారు. RBI ఏప్రిల్ ఒకటో తేదీ, 1935 నుంచి పనిచేయడం ప్రారంభించింది.
ఆర్బీఐ విధులు ఏమిటి..?

నోట్లను ముద్రించే హక్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఒక రూపాయి నోటు తప్ప అన్ని రకాల నోట్లను ఆర్‌బిఐ ముద్రిస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున ఒక రూపాయి నోటు జారీ చేస్తారు.
దీనితో పాటు, భారత ప్రభుత్వం, బ్యాంకులకు ఆర్‌బిఐ నియమాలను రూపొందిస్తుంది. వడ్డీ రేట్లను కూడా నిర్ణయిస్తుంది. ఆర్‌బిఐ దేశ విదేశీ మారక నిల్వలకు సంరక్షకుడు. దేశం, విదేశీ మారకపు రేటును స్థిరంగా ఉంచడానికి ఇది విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయడమేకాకుండా విక్రయిస్తుంది.