365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూన్ 15, 2025 : ప్రతి హిందూ పూజా కార్యక్రమా లలో అగ్రస్థానం, ఆరోగ్య ప్రదాయిని కర్పూరం! కర్పూరం..ఈ పదం వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది దేవుని ముందు వెలిగించే హారతి, ఇల్లంతా నిండిపోయే సుగంధం, కొన్ని వంటకాలలో వాడే సుగంధద్రవ్యం.
చాలామంది ఇది రసాయనాలతో కృత్రిమంగా తయార వుతుందని భావిస్తారు. కానీ, కర్పూరం చెట్టు నుండే లభ్యమవుతుంది అన్నది అక్షర సత్యం! లారేసీ కుటుంబానికి చెందిన ‘కాంఫర్ లారెల్’ లేదా ‘సిన్నమోముం క్యాంఫోరా’ అనే వృక్షం నుండే ఈ పవిత్ర ద్రవ్యం ఉత్పత్తి అవుతుంది.
కర్పూరం చెట్టు – ఓ అద్భుత సృష్టి..
కర్పూరాన్ని ప్రధానంగా ఈ చెట్ల ఆకులు, కొమ్మల నుంచి సేకరిస్తారు. కొన్ని రకాల తులసి (కర్పూర తులసి) జాతుల నుంచి కూడా కర్పూరం తయారవుతుంది. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెట్టినప్పుడు, వాటి నుంచి పాలు వస్తాయి. ఈ పాల నుండే కర్పూరం తయారవుతుంది.

కర్పూరం చెట్టు సుమారు వంద అడుగుల వరకు పెరిగే ఒక సుందరమైన, నిత్య హరిత వృక్షం. ఇది చక్కని సువాసన కలిగిన బెరడును కలిగి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకులు రాలి, పువ్వులు చిన్నవిగా పూస్తాయి.
ఇది కూడా చదవండి..బంధాలు, బంధుత్వాలు.. డబ్బు మహిమ పై కవిత..
పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో నీలగిరి కొండలు, మైసూరు, మలబార్ ప్రాంతాలలో కర్పూరం చెట్లు దర్శనమిస్తాయి.