365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైదరాబాద్,మార్చి15,2023: చక్కటి రుచితో కూడిన ఆహారం మీ గుండె ఆరోగ్యానికీ చక్కటి మార్గం అని చెబుతుంటారు, కానీ గుండె ఆరోగ్యం గురించి జాగ్రత్తపడేదెవరు..?
ఓ చక్కటి వంటనూనె సాధారణ ఆహారాన్ని కూడా అసాధారణ ఆహారంగా మార్చడం మాత్రమే కాదు, మీ గుండె ఆరోగ్యం కాపాడటంలో అత్యంత కీలకమైన పాత్రనూ పోషిస్తుంది. మీ కొలెస్ట్రాల్ స్ధాయి మార్చడంలో ప్రధానమైన పాత్రను వంటనూనెలు పోషించడం మాత్రమే కాదు, మీ జీర్ణక్రియనూ మారుస్తాయి. ఈ కారణం చేతనే మార్కెట్‌లో విస్తృతశ్రేణిలో అందుబాటులో ఉన్న వంటనూనెల నుంచి సరైనదానిని ఎంచుకోవడం ఆవశ్యకం. రైస్ బ్రాన్ ఆయిల్(ఆర్‌బీఓ) రైస్ బ్రాన్ ఆయిల్‌ను బ్రాన్ (తవుడు)నుంచి తీస్తారు.
బియ్యంపై గోధుమ రంగు పొరలా ఇది ఉంటుంది. పాలిష్ చేసిన బియ్యంతో పోలిస్తే ఇదే పొర బ్రౌన్‌రైస్ ను ఆరోగ్యవంతమైన అవకాశంగా మలుస్తుంది. పాలిష్ చేసిన బియ్యంలో ఈ పొర తొలగిస్తారు.
మార్కెట్‌లో అందుబాటులోని ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో ఆరోగ్యవంతమైన లక్షణాలన్నీ ఉన్నాయి. అందువల్ల వంటకు ఇది అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఆహార పదార్థాలకు అత్యుత్తమ రుచి, వాసనను అందిస్తుంది. సుప్రసిద్ధ చెఫ్‌లు చెప్పేదాని ప్రకారం అన్ని రకాల అత్యధిక ఉష్ణోగ్రతలలో వంట చేసేందుకు అనువైన నూనెగా రైస్‌బ్రాన్ ఆయిల్ నిలుస్తుంది.
పాన్ ఫ్రైయింగ్ లేదా డీప్ ఫ్రైయింగ్‌కు ఇది అత్యంత అనుకూలమైనది. అంతేకాదు,భారతీయ వంటగదిలో అన్ని రకాల డిష్‌లనూ తయారుచేసేందుకు ఇది తగిన రీతిలో ఉంటుంది.
దీని స్థిరత్వం, ఆహ్లాదకరమైన వాసన, అత్యధిక స్మోకింగ్ పాయింట్ కారణంగా రైస్ బ్రాన్‌ఆయిల్,అత్యుత్తమంగా వంటకు మాధ్యమంగా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా భారతీయ కుటుంబాలలో ఇదిఅత్యుత్తమంగా తోడ్పడుతుంది.
రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలు..
ఫిజకల్‌గా రిఫైన్ చేసిన రైస్ బ్రాయిల్ సాధారణంగా గోల్డెన్ ఎల్లో రంగులో ఉంటుంది. దీనిని స్టీమ్ డిస్టిలేషన్ విధానంలో రిఫైన్డ్ చేస్తారు. దీనివల్ల పోషకాలన్నీ నిలిచి ఉంటాయి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో 10000+ పీపీఎం ఒరిజనాల్ ఉంది.
ఇది చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గించడంతో పాటుగా మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) సరైన ప్రమాణాలలో ఉంచి మిమ్మల్ని, మీరు అభిమానించే వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. దీనికి గుండెకు అత్యంత అనుకూలమైన నూనెగా భావించడం జరుగుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గించే సామర్ధ్యం ఉండటమే దీనికి కారణం. ఈ నూనెలో తగిన మొత్తంలో ఒరైజనాల్ ఉంటుంది. శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లలో ఒరైజనాల్ ఒకటి.
ప్రపంచ ఆరోగ్య సంస్ధతో పాటుగా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించే దాని ప్రకారం ఇతర వెజిటేబుల్ ఆయిల్స్‌తో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్‌లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్, శాచురేటెడ్ ఫ్యాట్స్ అత్యుత్తమ పరిమాణంలో ఉన్నాయి.
సమతుల్యమైన ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరం ఆరోగ్యవంతమైన ఎల్‌డీఎల్,హెచ్‌డీఎల్ రేషియో నిర్వహించడంలో తోడ్పడటంతో పాటుగా కొలెస్ట్రాల్‌లో చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్) స్థాయి తగ్గించడంలో తోడ్పడుతుంది.
గుండె సరిగా పనిచేసేందుకు కావాల్సిన అంశమిది. ఎల్‌డీఎల్ తక్కువగా ఉంటే అథెరోస్కెలెరోసిస్ మరియు హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్ నివారించడం సాధ్యమవుతుంది.
నిపుణులు వెల్లడించే దాని ప్రకారం, ఒకవేళ ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించడంతో పాటుగా సరైనది తినడం, కనీసం రెండు లీటర్ల నీరు తాగడం, చెడు వ్యసనాలైనటువంటి ధూమపానం మానేయడం, మధుమేహం, హైపర్‌టెన్షన్ ,ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలు
తగ్గించుకుంటూనే రైస్‌బ్రాన్ ఆయిల్ లాంటి ఆరోగ్యవంతమైన నూనెలు ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యం, సురక్షితంగా ఉండవచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ.చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ‘‘మా వినియోగదారుల కోసం చక్కటి, సౌకర్యవంతమైన, ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు మేము నిరంతరమూ ప్రయత్నిస్తూనే ఉంటుంటాము.
నేడు, వినియోగదారులు తెలివితో వ్యవహరిస్తున్నారు. అందువల్ల, వారు రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్య ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా రైస్ బ్రాన్ ఆయిల్‌లో వండిన వంటకాలు అతి తక్కువగా నూనె పీల్చుకుంటాయని విశ్వసిస్తున్నారు.
ఈ కారణంగా బాగా వేయించడానికి కూడా అత్యుత్తమంగా నిలుస్తున్నాయి. గత కొద్ది నెలలుగా రైస్ బ్రాన్ ఆయిల్ కోసం డిమాండ్ పెరుగుతుండటాన్ని మేము చూస్తున్నాం. దీనికి ఈ నూనె అందించే ఆరోగ్య ప్రయోజనాలు ఓ కారణమైతే, ఇతర వంటనూనెల ధరలు పెరగడమూ మరో కారణం.
అయితే, అన్ని బ్రాండ్‌ల రైస్ బ్రాన్ ఆయిల్‌లోనూ అదే తరహా ఒరైజనాల్ ఉండదు. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైండ్ రైస్ బ్రాన్ ఆయిల్‌లో అవసరమైన రీతిలో ఒరైజనాల్ అంటే 10000 పీపీఎం ఉంది. అందువల్ల వినియోగదారులు ఈ నూనెను స్వీకరించి, ఆరోగ్యంగా ఉండాల్సిందిగా అభ్యర్ధిస్తున్నాం’’ అని అన్నారు.