365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,డిసెంబర్ 7,2022: జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమ వుతున్నారు. అందుకోసం పవన్ తన యాత్రకు వినియోగించే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్న సంగతి తెలిసిందే..ఆ వాహనాన్ని ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
https://www.youtube.com/shorts/MhJua8tx_W0
చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనానికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వెహికల్ కు ‘వారాహి’… అని పేరుపెట్టారు. “రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్” అని అనౌన్స్ చేశారు.
హైదరాబాద్ లో ఈ వాహనాన్ని పవన్ కళ్యాణ్ బుధవారం పరిశీలించారు. వాహనానికి సంబంధించి జనసేనపార్టీ నాయకుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు కొన్నిసూచనలు చేశారు జనసేనాని. వాహనాన్ని తీర్చిదిద్దుతున్న సాంకేతిక నిపుణులతోను పవన్ చర్చించారు.
“వారాహి ” పేరు వెనుక పెద్ద చరిత్రే ఉంది..
ఈ వాహనానికి “వారాహి” అమ్మవారి పేరుపెట్టారు. దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు..”వారాహి” అమ్మవారు. అన్ని దిక్కులను రక్షించే దేవతగా “వారాహి” అమ్మవారిని భావిస్తారు. అంతేకాదు పురాణాల్లోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారట. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు..ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారట.
జనసేనాని “వారాహి” ప్రత్యేకతలు..ఇవే..
“వారాహి” ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేక లైటింగ్… ఆధునిక సౌండ్ సిస్టమ్స్ తోపాటు ప్రత్యేక భద్రత చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వారాహి వాహనంపై ప్రత్యేక లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి.
https://www.youtube.com/shorts/MhJua8tx_W0
వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సందర్భంలో – లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేశారు. ఆధునిక సౌండ్ సిస్టం వినియోగించారు. వేల మందికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం వినిపించే విధంగా ఈ సౌండ్ సిస్టం ఉంటుంది.
వారాహి.. వాహనానికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం నిలిపిన, సభ నిర్వహించే ప్రదేశంలో పరిస్థితి రికార్డయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్ కి రియల్ టైంలో వెళ్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురయిన అంశాలని దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలు తీసుకున్నారు.
వాహనం లోపల పవన్ కళ్యాణ్ తోపాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరుకోవచ్చు.
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు..
జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో “వారాహి” వాహనానికి ప్రత్యేక పూజలు చేయించినతర్వాత..”వారాహి” వాహనంపై పర్యటన మొదలుపెట్టనున్నారు పవన్ కళ్యాణ్.