Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar - Regional Head-Dietetics, Max Healthcare – DelhiThree reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar - Regional Head-Dietetics, Max Healthcare – Delhi

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఢిల్లీ,జనవరి 29, 2021:ప్రస్తుత మహమ్మారితో, సుదీర్ఘమైన పనిగంటలు,  ఇంటి వద్ద సహకరించడం, బాధ్యతలు వృద్ధి చెందడం ,మీ కుటుంబంతో పాటుగా మీ గురించి మీరు జాగ్రత్త పడటం వంటి కారణాల చేత త్వరగా అలసిపోవడం జరుగుతుంది. మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవడం అతి ముఖ్యం. తద్వారా మీరు మీ కుటుంబానికి తగిన సహాయమూ చేయగలరు.చిన్నవే అయినప్పటికీ ప్రభావవంతమైన మార్పులను మీ జీవనశైలికి చేసుకోవడం వల్ల మీ జీవిత నాణ్యత మెరుగుపరుచుకోవడంతో పాటుగా మెరుగైన ఆరోగ్యమూ పొందగలరనే భరోసా పొందగలరు. దీనిని ఆరంభించడానికి అత్యుత్తమ మార్గం సమాచార యుక్త ఆహార ప్రాధాన్యతలను తీసుకోవడం,సరిగా ఆహారం తీసుకోవడం. ఒకరి ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారం అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుందని అందరికీ తెలిసిన అంశమే !అత్యంత రుచికరమైనప్పటికీ,వైవిధ్యమైన గింజ ధాన్యాలలో బాదము ఒకటి. దీనిలో విటమిన్‌ ఈ, మెగ్నీషియం,  రిబోఫ్లావిన్‌, జింక్‌ తదితర 15 రకాల పోషకాలు ఉంటాయి. మీ రోజువారీ ఆహారంలో  బాదములు ఎందుకు జోడించుకోవాలో తెలిపేందుకు మూడు ముఖ్య కారణాలు

Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar - Regional Head-Dietetics, Max Healthcare – Delhi
Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar – Regional Head-Dietetics, Max Healthcare – Delhi

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే స్నాక్‌ :

అత్యంత రుచికరమైన స్నాక్‌,  బాదము. ఆరోగ్యం ,శ్రేయస్సు కోసం ప్రతీకగా బాదములను ఎప్పుడూ భావిస్తుంటారు. ఈ గింజలో ఎన్నో విధాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే పోషకాలు ఉన్నాయి. మెరుగైన ఆరోగ్యం పొందేందుకు ఇవి అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మీ గుండె ఆరోగ్యం కోసం ఇవి ఎంతగానో తోడ్పడతాయి. కార్డియోవాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ) అనేది భారతదేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా అత్యధిక మరణాలకు కారణమవుతుంది. దీనికి అతి ప్రధానమైన కారణాలలో ఒకటి స్థిరమైన జీవనశైలి అలవాట్లు. భారతీయులు అలవరుచుకున్న ఆ అలవాట్లలో శారీరక వ్యాయామాలు లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఉప్పు, పంచదార లాంటి వాటిని అధికంగా ఆరగించడం, శాచురేటెడ్,ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ను తీసుకోవడం వంటివి కనిపిస్తుంటాయి.సైకోసోషల్‌ కారణాలో మానసిక ఒత్తిడి కూడా ఓ కారణంగా నిలుస్తుంది. ఇది కూడా కార్డియో వాస్క్యులర్‌ డిసీజ్‌ (సీవీడీ)ప్రమాదం పెరిగేందుకు దోహదపడుతుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు, నూతన సాధారణతను స్వీకరిస్తున్న వేళ కూడా చాలామంది అధిక స్థాయిలో ఒత్తిడిని అనుభవిస్తున్నారు. భారతీయ ప్రజల నడుమ జరిగిన ఎన్నో క్లీనికల్‌ అధ్యయనాలలో ప్రత్యేకంగా సూచించినది ఏమిటంటే, బాదములు వల్ల గుండె వ్యాధులను కలిగించే ప్రమాద కారకాలను నివారించడం సాధ్యమవుతుంది. అంతేకాదు, ఇటీవలి కాలంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో, సంప్రదాయ స్నాక్స్‌ స్థానంలో బాదములను జోడించుకోవడం ద్వారా హార్ట్‌రేట్‌ వేరియబిలిటీ అనేది మానసిక ఒత్తిడికి అనుగుణంగా మెరుగుపడుతుంది.  మెరుగైన కార్డియాక్‌ ఆరోగ్యం , ఫంక్షన్‌కు ఇది అత్యంత కీలకమైన సూచికగా నిలుస్తుంది. అందువల్ల మీ రోజువారీ ఆహారంలో  బాదములు జోడించుకోండి. బలమైన,ఆరోగ్యవంతమైన గుండెగా మలుచుకోండి.

మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది…

Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar - Regional Head-Dietetics, Max Healthcare – Delhi
Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar – Regional Head-Dietetics, Max Healthcare – Delhi

మహమ్మారి ఇప్పటిలో అంతమయ్యే సూచనలేవీ కనిపించడం లేదు. గతానికన్నా మిన్నగా నివారణా చర్యలు తీసుకోవడంతో పాటుగా మన రోగ నిరోధక వ్యవస్థను సైతం మెరుగుపరుచుకోవాల్సి ఉంది. దీనిని ఆరంభించడానికి అత్యుత్తమ మార్గంగా మీ జీవనశైలి ,డైట్‌ను మార్చుకోవడం నిలుస్తుంది. పోషకాలు కలిగిన ఆహారం జోడించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఇది ఓ వ్యక్తి రోగ నిరోధక వ్యవస్ధపై సానుకూల ప్రభావం చూపుతుంది. బాదములను  తరచుగా తినడం వల్ల అది రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటుగా దీనిలో ఉండే విటమిన్‌ ఈ, జింక్‌, రాగి, ఫోలేట్,ఐరన్‌ వంటివి  బలీయమైన రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పాటునందించవచ్చు.బాదములలో అత్యధిక స్థాయిలో విటమిన్‌ ఈ ఉంటుంది. ఇది ప్రాధమిక రోగ నిరోధక వ్యవస్థకు మద్దతునందించే యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. వైరస్,బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల నుంచి సైతం రక్షణను విటమిన్‌ ఈ అందిస్తుంది. దీనిని మించి, బాదములలో రాగి సైతం అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ సాధారణంగా పనిచేసేందుకు ఇది తోడ్పడుతుంది.బాదములలో జింక్‌ సైతం అధికంగా ఉంటుంది.  రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్రను జింక్‌ పోషిస్తుంది. సాధారణ అభివృద్ధికి ఇది అత్యంత కీలకంగా ఉండటంతో పాటుగా న్యూట్రోఫిల్స్,ఇతర సహజసిద్ధమైన కిల్లర్‌ కణాలు పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. చివరగా, బాదములలో ఇనుము సైతం అధికంగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిన కణాలు విస్తరణ, పరిపక్వత మరీ ముఖ్యంగా లింఫోసైట్లు మెరుగ్గా పనిచేసేందుకు తోడ్పడుతుంది.

మీ బరువు నిర్వహించడంలో సహాయపడుతుంది

Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar - Regional Head-Dietetics, Max Healthcare – Delhi
Three reasons why you should include almonds in your diet by Ms. Ritika Samaddar – Regional Head-Dietetics, Max Healthcare – Delhi

మనలో చాలామంది ఇప్పుడు తీవ్రస్ధాయి ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తుండటం చేత స్నాకింగ్‌ అధికంగా తీసుకోవడంతో పాటుగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలనూ చూస్తున్నారు. ముందుగాచెప్పినట్లు, మనలో చాలామందికి బరువు పెరగడమనేది అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారింది. ఆలస్యం కాకమునుపే, మనం ఖచ్చితంగా ఆప్రమప్తతతో వ్యవహరించి మన రోజువారీ ఆహార అలవాట్లలో కొద్ది పాటి మార్పులను చేసుకోవాల్సి ఉంది. అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములు లాంటి వాటిని తీసుకుంటే, ఆకలి తగ్గుతుంది. మరీ ముఖ్యంగా భోజనానికి, భోజనానికి  నడుమ వీటిని ఇతర స్వీట్లు లేదంటే చిరుతిళ్లకు బదులుగా తీసుకోవడం మంచిది. బాదములు తీసుకోవడం వల్ల కడుపు నిండిందన్న భావన కలుగుతుంది.  అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం బాదములను తీసుకోవడం వల్ల అనాలోచితంగా అత్యధిక కొవ్వు కలిగిన ఆహారం తీసుకోవాలన్న కోరికను అధికమించడంతో పాటుగా బరువు నియంత్రణ వ్యూహాలను ఖచ్చితంగా అమలు చేయడంలో కూడా తోడ్పడుతుంది. అందువల్ల, మరింత ఉపయుక్తమైన , పోషకాలు అధికంగా కలిగిన బాదములు వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవడం ఆరంభించండి. ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆరోగ్యవంతమైన జీవనశైలి దిశగా తమ ప్రయాణం ఆరంభించాయి. కానీ, ఈ మార్పులను స్నాకింగ్‌ సమయాలు, సందర్భాలలో సైతం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు, ఈ అలవాట్లను కుటుంబ సభ్యులందరూ అమలు చేయాలి. అది యువత లేదా పెద్దవారు అయినా సరే ! కనిపించే ప్రయోజనాలు వీరికి కలుగుతాయి. బాదములను తీసుకోవడమనేది ఓ చక్కటి అలవాటు. దీనిని మనమంతా కూడా అతి సులభంగా స్వీకరించవచ్చు. ఎందుకంటే వీటిని రోజులో ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు,భారతీయ వంటకాలలో సైతం మిళితం చేయవచ్చు.