365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,జనవరి 16,2023: చలికాలంలో చలిని తట్టుకునేందుకు ప్రజలు పలు జాగ్రత్తలు పాటిస్తారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం వల్ల చలికాలం మరింత పెరుగుతుంది కాబట్టి వేసవిలో లాగా తేలికపాటి బట్టలు వేసుకోకుండా పూర్తిగా కప్పుకునే బట్టలు, సాక్స్ వేసుకుని నిద్రపోతారు.
అయితే రాత్రి పడుకునేటప్పుడు కూడా సాక్స్ వేసుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. చలిలో సాక్స్ ధరించడం పాదాలను వెచ్చగా ఉంచుతుంది. మంచి నిద్రను ఇస్తుంది. కానీ సాక్స్ ధరించి నిద్రించడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
సాక్స్‌తో నిద్రపోవడం వల్ల అనేక శారీరక సమస్యలు తలెత్తుతాయని, రక్త ప్రసరణ దెబ్బతింటుందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందని వారు అంటున్నారు. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం..
రక్త ప్రసరణపై ప్రభావం..
![socks_sleeping](http://365telugu.com/wp-content/uploads/2023/01/socks_sleeping.jpg)
రాత్రిపూట సాక్స్‌తో నిద్రించడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది. మందపాటి సాక్స్ రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు పడుకునేటప్పుడు మీ సాక్స్ తీయండి, లేదా వదులుగా ఉన్న సాక్స్ ధరించండి.
శరీర ఉష్ణోగ్రత..
,
సాక్స్ కారణంగా గాలి ఆడదు, దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేడెక్కడం వల్ల, తలలో వేడి పెరుగుతుంది. అసౌకర్యం మొదల వుతుంది. సాక్స్‌తో నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.
రాత్రిపూట బిగుతుగా సాక్స్ వేసుకుని నిద్రపోవడం వల్ల పాదాల సిరలపై ఒత్తిడి పడుతుంది. దీని కారణంగా, రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది.
శీతాకాలంలో రోజంతా సాక్స్ ధరిస్తే.. దీని కారణంగా కాళ్లకు దుమ్ము, ధూళి అంటుకుంటాయి. రాత్రిపూట ఈ సాక్స్‌లు వేసుకోవడం వల్ల పాదాల్లో స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.