365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 18,2025 : “టొమాటో కెచప్‌లో టొమాటో ఉంది కదా, ఆరోగ్యానికి మంచిదే కదా?” అని మీరు అనుకుంటున్నారా? అయితే ఇది మీకు షాకింగ్ న్యూస్. ముఖ్యంగా కెచప్ ఆరోగ్యకరమైనదని నమ్మే తల్లిదండ్రులు, యువతకు ఈ కథనం ఒక రియాలిటీ చెక్.
ప్రముఖ హెపటాలజిస్ట్ లలో ఒకరైన డాక్టర్ కావ్య దెందుకూరి, టొమాటో కెచప్ వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఇది అధిక-ఫ్రక్టోజ్ షుగర్లు, రసాయన ప్రిజర్వేటివ్‌లు, సింథటిక్ రంగులు టొమాటో కెచప్ లో కలుపుతారు. అంతేకాదు ఇందులో పోషక విలువలు ఉండవని డాక్టర్ కావ్య దెందుకూరి స్పష్టం చేస్తున్నారు.
నిజం ఏమిటి..?
ప్రమాదకరమైన పదార్థాలు: కెచప్‌లో అధిక మొత్తంలో హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ వంటి చక్కెరలు ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తాయి.
రసాయన ప్రిజర్వేటివ్‌లు: దీర్ఘకాలం నిల్వ ఉండటానికి వాడే రసాయన ప్రిజర్వేటివ్‌లు శరీరానికి హానికరం.
సింథటిక్ రంగులు: కెచప్కు ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి వాడే కృత్రిమ రంగులు అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయి.
పోషక విలువ సున్నా: టొమాటోతో తయారైనప్పటికీ, ప్రాసెసింగ్ కారణంగా కెచప్‌లో ఎటువంటి పోషక విలువలు ఉండవు.
అనారోగ్య సమస్యలు..

ఇది కూడా చదవండి…వేవ్ ఫార్చూన్ స్మార్ట్‌వాచ్‌తో కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల విప్లవం – యాక్సిస్ బ్యాంక్, బోట్, మాస్టర్‌కార్డ్ సంయుక్తంగా ఆవిష్కరణ..
Read This also…Axis Bank Partners with boAt and Mastercard to Launch Contactless Payments on the New Wave Fortune Smartwatch..
ఈ అల్ట్రా-ప్రాసెస్డ్ కాండిమెంట్ భారతీయ కుటుంబాలకు నిశ్శబ్దంగా హాని కలిగిస్తుందని డాక్టర్ కావ్య చెబుతున్నారు. ఇది గట్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది (గట్ డామేజ్), ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం), హార్మోన్ల అసమతుల్యత, పిల్లలలో ముందస్తు యుక్తవయస్సు (early puberty),దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ (chronic inflammation) వంటి సమస్యలకు దారితీస్తుంది.
మేలుకోండి..! ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోండి..!
ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకుంటేనే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా ఉండొచ్చు. కెచప్ హానికరం కాదని భావించే ప్రతి స్నేహితుడికి, బంధువుకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి..! డాక్టర్ కావ్య దెందుకూరిని సంప్రదించండి:
గ్యాస్ట్రో & లివర్ స్పెషలిస్ట్
చిరునామా: 4వ అంతస్తు, వెస్ట్‌సైడ్ పైన, ఐడియల్ స్క్వేర్ బిల్డింగ్, గచ్చిబౌలి, హైదరాబాద్.
ఫోన్: +91-7416409977
వెబ్సైట్: www.drkavyadendukuri.com
అపాయింట్మెంట్ కోసం ఇప్పుడే DM చేయండి లేదా కాల్ చేయండి.