365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ , 5 జులై 2020 : తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74 వ వర్ధంతి సందర్భంగా కడివెండి లోని ఆయన స్థూపం వద్ద నివాళులు అర్పించారు పలువురు జర్నలిస్టులు. విసునూర్ దొర, దొరసాని దాష్టికాలపై విరోచితి పోరాటం చేసిన వీరుడు కొమురయ్య జీవిత చరిత్ర పై ఓ సినిమా తీయాలని నటుడు విజయ్ యాదవ్ అన్నారు..అందరూ సహకరిస్తే సినిమా పూర్తి చేసే బాధ్యతను తాను స్వీకరిస్తానని తెలిపారు.
ఈ నిర్ణయం పట్ల దొడ్డి కొమురయ్య కుటుంబీకులు , గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో టీవీ నటుడు విజయ్ యాదవ్ , సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి , దొడ్డి కొమురయ్య పుస్తక రచయిత మరిపాల శ్రీనివాస్ , సీనియర్ జర్నలిస్టు లు గోరంట్ల సత్యం , దయ్యాల అశోక్ కురుమలు పాల్గొన్నారు.