365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, న్యూఢిల్లీ, జూన్ 3,2025: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తమ కొత్త వాహనం థార్ ROXX AX7Lలో డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీని ప్రవేశపెట్టింది. డాల్బీ లాబొరేటరీస్ సహకారంతో రూపొందించిన ఈ టెక్నాలజీని ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రపంచంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత మహీంద్రాకే దక్కింది.
ఈ వాహనంలోని 4 ఛానెల్ల ఇమ్మర్సివ్ ఆడియో సౌండ్ వ్యవస్థ ప్రయాణాన్ని మరింత సాహసోపేతంగా మార్చనుందని సంస్థ ప్రకటించింది. నగర వీధుల్లోనైనా… అడవి మార్గాల్లోనైనా, థార్ ROXX వినూత్నంగా వినిపించే డాల్బీ అట్మోస్ ధ్వనితో ప్రయాణాన్ని మధుర అనుభూతిగా మార్చనుంది.
Read This also…HAMLEYS BRINGS ITS ICONIC MAGIC TO KUWAIT WITH GRAND OPENING AT THE AVENUES MALL
ప్రత్యేకతలు ఇవే…
థార్ ROXX వాహనంలో గానా స్ట్రీమింగ్ నేరుగా ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ఏకీకృతం కావడంతో, వినియోగదారులు ఎప్పుడైనా తమకు ఇష్టమైన సంగీతాన్ని డాల్బీ అట్మోస్ క్వాలిటీలో ఆస్వాదించవచ్చు.

ఈ భాగస్వామ్యంపై డాల్బీ లాబొరేటరీస్ IMEA సీనియర్ డైరెక్టర్ కరణ్ గ్రోవర్ మాట్లాడుతూ, “థార్ ROXXలో డాల్బీ అట్మోస్‌ను అందించడం మా భాగస్వామ్యంలో మైలురాయిగా నిలిచింది. ఇంటీరియర్ క్యాబిన్‌ను వ్యక్తిగత సంగీత కచేరీగా మార్చే విధంగా ఇది పని చేస్తుంది” అని తెలిపారు.
ప్రపంచానికి మార్గదర్శిగా…
మహీంద్రా ఆటోమొటివ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్రెసిడెంట్ వేలుసామి ఆర్ మాట్లాడుతూ, “డాల్బీ అట్మోస్‌తో కూడిన హర్మన్ కార్డాన్ 9 స్పీకర్ ఆడియో సిస్టమ్ వాహనంలో వినూత్నమైన అనుభూతిని అందిస్తుంది. భారత రహదారులపై ప్రీమియం సౌండ్‌తో ప్రయాణ అనుభూతిని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది” అని చెప్పారు.
థార్ ROXXలో అమలు చేసిన ఈ అధునాతన ఆడియో టెక్నాలజీ వినియోగదారుల మౌలిక డిజిటల్ జీవనశైలికి అనుగుణంగా ఉండేలా రూపొందించామని, దీని ద్వారా భారత వినియోగదారులకు ఎదురుచూసే సమయాన్ని తగ్గించి అత్యున్నత వినోదాన్ని అందిస్తున్నామని మహీంద్రా పేర్కొంది.