Dolby365telugu

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ ,ఫిబ్రవరి1, 2023: లీనమయ్యే వినోద అనుభవాలను అందించే డాల్బీ అట్మోస్ సరికొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. డాల్బీ అట్మోస్ పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వినియోగదారుల కోసం ‘డాల్బీ మెయిన్ సునా ఔర్ దేఖా క్యా’ ప్రచారాన్ని ప్రారంభించింది డాల్బీ అట్మోస్.

డాల్బీ డిసెంబర్ 2012లో భారతదేశంలో డాల్బీ అట్మోస్‌ను పరిచయం చేసింది. అప్పటి నుంచి సినిమాలు, టీవీ కార్యక్రమాలు, క్రీడలు, గేమింగ్ , సంగీతం వంటి విభాగాల్లో డాల్బీ అట్మోస్ తనదైన ముద్ర వేసింది.

Dolby365telugu

ప్రస్తుతం భారతదేశంలోని వీక్షకులు 6భారతీయ భాషల్లో 1200పైగా భారతీయ చలనచిత్రాలను, 850పైగా డాల్బీ అట్మాస్ స్క్రీన్‌లలోనూ, స్ట్రీమింగ్ సేవలలోను అనేక గంటల ఒరిజినల్ టీవీ షోలను డాల్బీ అట్మాస్‌ సంగీతాన్ని అందిస్తోంది.

Dolby Atmos స్పష్టమైన మల్టీ డైమెన్షనల్ సౌండ్ అందిస్తోంది. వినోద రంగంలో డాల్బీ అట్మోస్ సరికొత్త ట్రెండ్ ను క్రేయేట్ చేసింది. డాల్బీ కళాకారులు, చలనచిత్ర పరిశ్రమ, A/V కంపెనీలు, వ్యాపారాలు ,ఇతరుల సహకారంతో ప్రజలకు ఆవిష్కరణలను అందిస్తుంది.

ఇంజనీర్లు, కలర్‌ఆర్టిస్టులను ఇతరులతో కలపడానికి సహకారాన్ని రూపొందించడానికి, డైరెక్టర్ల నుంచి కంటెంట్ క్రేయేషన్ లోని అనేక మంది వాటాదారులతో డాల్బీ పనిచేస్తుంది.

భారతదేశంలో, డాల్బీ అట్మోస్‌లో విడుదలైన మల్టీ బ్లాక్‌బస్టర్ సినిమాలతో కంటెంట్ సృష్టి వ్యవస్థలో డాల్బీ అట్మోస్‌ను బలంగా స్వీకరించారు.

Dolby365telugu

భారతదేశంలోని వినియోగదారులు అనేక రకాలుగా డాల్బీ అట్మాస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా, టీవీలు, సౌండ్‌బార్‌లతో లివింగ్ రూమ్‌లో, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్‌లలో మొబైల్‌లో, గేమింగ్‌ విభాగంలో సైతం డాల్బీ అట్మోస్‌ సేవలందిస్తోంది.

వాహనాల్లో ప్రయాణించేటప్పుడు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్‌స్టార్, సన్‌ఎన్‌ఎక్స్‌టి, హోయిచోయ్, జీ5, ఎరోస్ నౌ, సింప్లీ సౌత్, యాపిల్ మ్యూజిక్, హంగామా మ్యూజిక్, గానా, ప్లేటూమ్, వంటి గ్లోబల్ ,ఇండియన్ A/V, ఆడియో స్ట్రీమింగ్ సర్వీస్‌లు రెండూ డాల్బీ అట్మోస్‌లో కంటెంట్‌ను అందిస్తాయి.

ఇయర్‌షాట్ పాడ్‌క్యాస్ట్‌లు, టైమ్స్ స్పెషల్ పాడ్‌క్యాస్ట్‌లు, స్పైస్‌స్క్రీన్, Aawaz.com మొదలైన విభాగాల్లో డాల్బీ అట్మోస్‌ సేవలందిస్తోంది. చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, సినిమా ఔత్సాహికులతో సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా డాల్బీ ముందుకు దూసుకుపోతోంది.

ప్రస్తుతం తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 200పైగా స్క్రీన్లలో డాల్బీ అట్మాస్ డిసెంబర్ 2022 నాటికి ఇన్‌స్టాల్ చేశారు. 300పైగా టైటిల్స్ డాల్బీ అట్మోస్‌లో విడుదలయ్యాయి.

2022లోనే 80పైగా తమిళ టైటిల్స్ ,100పైగా డాల్బీ అట్మాస్‌లో తెలుగు టైటిల్స్, 60పైగా మలయాళం టైటిల్స్ ,30పైగా కన్నడ టైటిల్స్ విడుదలయ్యాయి.

2022 నుంచి డాల్బీ అట్మాస్‌లో విడుదలైన కొన్ని ప్రసిద్ధ దక్షిణ భారత టైటిల్స్‌లో పొన్నియన్ సెల్వన్ 1, ​​విక్రమ్, బీస్ట్, వాలిమై, డాన్, ఆర్ఆర్ఆర్, విక్రాంత్ రోనా వంటి సినిమాలు ఉన్నాయి.

Dolby365telugu

డాల్బీ భారతదేశంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. ‘డాల్బీ మెయిన్ సునా ఔర్ దేఖా క్యా’ పేరుతో న్యూ క్యాంపెయిన్ ను స్టార్ట్ చేసింది.

మొబైల్‌లో, ఆడియో పరికరాలపై లేదా గదిలో లభించే డాల్బీ వ్యత్యాసం గురించి వినియోగదారులకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని డాల్బీ లేబొరేటరీస్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ సమీర్ సేథ్ తెలిపారు.

సృజనాత్మక దిశలో వారి ఆసక్తిని రేకెత్తించడానికి మా ప్రేక్షకులలో FOMO భావాన్ని సృష్టిస్తుందని, డాల్బీ లేకుండా వారి అనుభవం అసంపూర్ణంగా ఉంటుందని ఆయన చెప్పారు.

కేవలం వినడం,చూడడం మాత్రమే కాదు, డాల్బీలో వినోదాన్ని అనుభూతి చెందుతారనే అవగాహన కల్పించడానికి సరికొత్త ప్రచారాన్ని చేపట్టామని డాల్బీ లేబొరేటరీస్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ సమీర్ సేథ్ వెల్లడించారు.