Fri. Nov 8th, 2024
coal
coal

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూన్ 20,2022 : గత ఐదేళ్లలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి వార్షిక వృద్ధి(సీఏజీఆర్) 1.82శాతంగా నమోదయింది. అయితే విద్యుత్ రంగానికి దేశీయ బొగ్గు సరఫరా మెరుగుపడటంతో మొత్తం వార్షిక వృద్ధి రేటు 3.26శాతానికి చేరింది. బొగ్గు ఆధారిత విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా విద్యుత్ ఉత్పత్తికి మించి జరిగింది. ప్రస్తుత సంవత్సరం కూడా పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది. ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఎ) కింద చేయాల్సిన సరఫరా కంటే ఎక్కువగా బొగ్గు 2021-22 సంవత్సరంలో సిఐఎల్ నుంచి డిసిబి పవర్ ప్లాంట్‌లకు సరఫరా జరిగింది.

coal

సిఐఎల్ 540 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసింది. దీనిలో ఎఫ్‌ఎస్‌ఎ కింద 483 మిలియన్ టన్నుల బొగ్గు గా సరఫరా అయ్యింది. 2021-22 సంవత్సరంలో డిసిబి పవర్ ప్లాంట్లు 69శాతం పిఎల్ఎఫ్ వద్ద పనిచేయడానికి ఈ బొగ్గు సరిపోతుంది. అయితే, డిసిబి పవర్ ప్లాంట్లు 61.3శాతం పిఎల్ఎఫ్ వద్ద ఉత్పత్తి సాగిస్తున్నాయి. పవర్ ప్లాంట్లు 2022-23 సంవత్సరంలో ఎఫ్‌ఎస్‌ఎ ప్రకారం సిఐఎల్ తన అనుసంధానిత పవర్ ప్లాంట్‌లకు (85శాతం పిఎల్ఎఫ్ వద్ద)120.67 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. అయితే, సిఐఎల్129.58 మిలియన్ టన్నుల బొగ్గు (16.06.22 వరకు) సరఫరా చేసింది. 85శాతం పిఎల్ఎఫ్ వద్ద పని చేస్తే ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన సరఫరా కంటే ఈ సరఫరా 7.4శాతం ఎక్కువ. దాదాపు 70శాతం పిఎల్ఎఫ్ వద్ద ఉత్పత్తి జరిగినప్పుడు అవసరమయ్యే బొగ్గు కంటే ఎఫ్‌ఎస్‌ఎ కింద అనుబంధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సిఐఎల్ నుంచి సరఫరా అవుతున్న బొగ్గు అవసరాల కంటే 30.4% ఎక్కువగా ఉంది.

coal

ఉత్పత్తితో పాటు సిఐఎల్ నుంచి విద్యుత్ రంగానికి రవాణా అవుతున్న రైళ్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. విద్యుత్ రంగానికి 2020-2లో రోజుకు 215.8 రైళ్లలో బొగ్గు సరఫరా అయ్యేది. 2021-22లోఈ సంఖ్య 26శాతం వృద్ధిని నమోదు చేసి రోజుకు 271.9కి పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో (16 జూన్ 2022 వరకు ) విద్యుత్ రంగానికి సిఐఎల్ సరఫరా చేస్తున్న రైళ్ల సంఖ్య గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 25శాతంపెరిగింది. అదే సమయంలో బొగ్గు నిల్వలు సుదూర ప్లాంట్ల కంటే పిట్ హెడ్ పవర్ ప్లాంట్ల వద్ద ఎక్కువగా ఉన్నాయి. 2022లో జూన్ 16, 2022 వరకు డిసిబి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో రికార్డు స్థాయిలో రోజుకు 3.3 బియూ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ కాలంలో డిసిబి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తగ్గలేదు. బొగ్గు నిల్వలు 21.85 మిలియన్ టన్నుల 2022 జూన్ నాటికి నుంచి జూన్ 16 నాటికి 22.64 మిలియన్ టన్నులకు పెరిగింది. బొగ్గు ఉత్పత్తి పెరుగుతున్న డిమాండ్‌ కు అనుగుణంగా తగినంత సరఫరాను ప్రతిబింబిస్తుంది. బొగ్గు నిల్వ 10రోజుల అవసరాలకు సరిపోతుంది.

coal

16 జూన్ 22 నాటికి వివిధ దేశీయ బొగ్గు గనులలో 52మిలియన్ టన్నులకు మించి బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఇది విద్యుత్ ప్లాంట్ల 24 రోజుల అవసరాలకు సరిపోతుంది. దీనికి అదనంగా, వివిధ గూడ్‌షెడ్ సైడింగ్‌లు, ప్రైవేట్ వాషరీస్, పోర్ట్‌లలో సుమారు 4.5 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు విద్యుత్ ప్లాంట్‌లకు రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వర్షాకాలంలో బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పటికీ వరదలు మరియు కన్వేయర్ వ్యవస్థలో తేమ చేరడం వంటి కారణాల వల్ల నిల్వ కేంద్రాలకు బొగ్గు రవాణా చేయడంలో సమస్యలను గనులు ఎదు ర్కొంటాయి.

రెండవ త్రైమాసికం ముగిసే సమయానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు సిఐఎల్ గనుల వద్ద బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉంటాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తి సమస్య కాదు. ఎఫ్‌ఎస్‌ఎ అవసరాలకు మించి సిఐఎల్ నుంచి బొగ్గు సరఫరా ఎక్కువగా జరిగింది. అయితే, ఆసక్తిగల విద్యుత్ రంగ వినియోగదారుల (రాష్ట్ర జెన్కోలు,ఐపీపి లు) బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సిఐఎల్ అంగీకరించి మూడు నెలల్లో 2.4 మిలియన్ టన్నుల సరఫరా కోసం స్వల్పకాలిక టెండర్‌ను, ఏడాది కాలంలో ఆరు మిలియన్ టన్నుల చొప్పున బొగ్గు దిగుమతి కోసం రెండు దీర్ఘకాలిక టెండర్‌లను సిఐఎల్ విడుదల చేసింది.

error: Content is protected !!