
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,ఏప్రిల్ 9,2022: అమెరికాకు చెందిన శ్రీ రవి ఐకా శనివారం ఎస్వీబిసికి ఒక కోటి 32 లక్షలు విరాళంగా అందించారు.శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీరవి ఐకా ప్రతినిధి విజయవాడకు చెందిన శ్రీ రామకృష్ణ విరాళం డిడిని అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.

ఎస్వీబిసికి అవసరమైన కెమెరాల కోనుగోలుకు రవి ఐకా ఏడు కోట్లు విరాళం ప్రకటించారు. అందులో ఇప్పటికే 4 కోట్ల 20 లక్షలు అందజేశారు.