
365తెలుగు డాట్ కామ్ ,ఆన్ లైన్ న్యూస్, భద్రాద్రిజిల్లా ,జూన్ 15,2021: భద్రాద్రి దేవస్థానం సీతారామచంద్రులకు13.50 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించారు. బెంగళూరుకు చెందిన జేవీ రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు.

ప్రముఖ స్థపతి కోదండపాణి రామయ్య స్వర్ణ భద్రకవచాలను తయారు చేయడం విశేషం. ఇకనుంచీ ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచాలతో బంగారు రామయ్యగా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఇంత భారీస్థాయిలో విరాళాన్ని అందజేసిన దాతలు లేరు.