365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,19,సైబరాబాద్, మే 2025:సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన “డోరేమాన్ మీట్ & గ్రీట్” కార్యక్రమం ఘనవిజయాన్ని సాధించింది. వందలాది కుటుంబాలు, చిన్నారులు పాల్గొన్న ఈ కార్యక్రమం అందరికీ గుర్తుండిపోయే అనుభూతులను అందించింది.

పిల్లల అభిమాన పాత్రలు డోరేమాన్, నోబితా ప్రత్యక్షంగా వారిని పలకరించడంతో చిన్నారుల ఉత్సాహానికి హద్దులు లేకపోయాయి. ఫోటోలు, చిరునవ్వులు, కౌగిలింతలతో ఈ సెషన్లు సందడిగా సాగాయి.

కార్యక్రమ హైలైట్స్:

కుంభమేళాలో ‘మైదాన్ సాఫ్’ ప్రయత్నాలపై డాక్యుమెంటరీతో డిస్కవరీ ఛానల్…

ఇది కూడా చదవండి…Gen Z డిమాండుకు తగ్గట్టుగా అమెజాన్ ఫ్యాషన్ ‘సర్వ్’ ఆవిష్కరణ..

ఇది కూడా చదవండి…దక్షిణ భారతదేశంలో టొయోటా ‘మెగా సమ్మర్ సెలబ్రేషన్’ ప్రారంభం

ఇది కూడా చదవండి…ఇసుజు మోటార్స్ ఇండియా తిరుపతిలో కొత్త 3S ఫెసిలిటీ ప్రారంభం

పాత్రలతో ప్రత్యక్ష భేటీ: డోరేమాన్, నోబితాలు రంగుల హంగులతో మాల్ చుట్టూ విహరిస్తూ పిల్లలతో పలకరించడమేగాక, వారికి మంచి వినోదం అందించారు.
ఇంటరాక్టివ్ యాక్టివిటీ జోన్: కలరింగ్ స్టేషన్లు, పజిల్ గేమ్స్ వంటి ఆటలతో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం పొందారు.
టిమ్ హోర్టన్స్ డోనట్ డెకర్ వర్క్‌షాప్: ఈ ప్రత్యేక వర్క్‌షాప్‌లో పిల్లలు తామే స్వయంగా డోనట్‌లను డిజైన్ చేసి, రంగురంగుల టాపింగ్స్‌తో అలంకరించి ఆనందించారు.

పిల్లలకు అనందాన్ని, తల్లిదండ్రులకు తృప్తిని కలిగించిన ఈ ఈవెంట్, ఇనార్బిట్ మాల్ చరిత్రలో మరచిపోలేని కుటుంబ-స్నేహపూర్వక వారాంతంగా నిలిచింది.