Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జూన్ 10,2023: నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గ్రౌండ్స్ లో కె- ఇన్నోవేటివ్ హబ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ , పల్లవి మేనేజ్‌మెంట్ సహకారంతో ఆయా సంస్థత ఉద్యోగులకు 2023, జూన్ 8, 9వ తేదీల్లో స్పోర్ట్స్ మీట్ జరిగింది.

ఇందులోభాగంగా క్రికెట్,బ్యాడ్మింటన్ క్రీడలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 5 శాఖలు పల్లవి స్కూల్స్ 9 శాఖల భాగస్వామ్యంతో రెండు రోజులుపాటు టోర్నమెంట్ జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహించాలనే ఆలోచన రావడం, దాన్ని అమలు చేయడంలో ఈ విద్యావ్యవస్థల సీఓఓ మల్కా యశస్వి కీలక పాత్ర పోషించారు.

ఈ టోర్నమెంట్ ను డీపీఎస్, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఛైర్మన్ మల్కా కొమరయ్య ప్రారంభించారు. క్రికెట్, బ్యాడ్మింటన్‌లో పాల్గొన్న ఉద్యోగులందరినీ ఆయన అభినందించారు.

స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బోయిన్ పల్లి పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రేణు చక్రవర్తి, అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సిమ్మి నాగి, గండిపేట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమ మాడభూషి, సికింద్రాబాద్ AVIS ప్రిన్సిపల్ వనజ, కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ రోజ్, బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్ తనూజ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ విజేతలుగా మొదటి స్థానంలో డీపీఎస్ నాచారం నుంచి సుజాత ఫబంది, నీతూ పాండే నిలిచారు. అలాగే రెండో స్థానంలో డీపీఎస్ ఎయిరోసిటీ నుంచి మాచెర్ల చైతన్య, డి.బిందు ప్రియ.. మూడో స్థానంలో డీపీఎస్ నాచారం నుంచి అశ్వతి రాజగోపాలం, ఇందర్జిత్ కౌర్ నిలిచారు.

ఈ రెండు రోజుల కార్యక్రమంలో మొత్తం పన్నెండు జట్లు క్రికెట్ ఆడాయి. ఫైనల్ మ్యాచ్ టీమ్ కె-ఇన్నోవేటివ్ ,గండిపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ మధ్య రసవత్తరంగా సాగింది. ఇందులో కె-ఇన్నోవేటివ్ స్కోర్ 95కాగా, గండిపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 70 స్కోర్ చేసింది.

ఈ ఆటలో చివరగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కె-ఇన్నోవేటివ్ నుంచి మల్కా యశస్వి, గండిపేట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా గౌరవ్ నిలిచారు.

error: Content is protected !!