Fri. Nov 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, 4 మార్చి, 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని అతి పెద్ద కంటి ఆస్పత్రుల నెట్‌వర్క్ డాక్టర్‌ అగర్వాల్స్ ఐ హాస్పిటిల్‌ తెలంగాణలోని తన అన్ని బ్రాంచుల్లో అన్ని వయస్సుల వారికి మార్చి 31, 2022న వరకు మహిళలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం 9619334129 నెంబర్‌కు సంప్రదించండి.

మహిళల్లో తలెత్తే కొన్ని రకాల కంటి వ్యాధులు, లోపాలతో పాటు ఇటీవల కాలంలో పెరుగుతున్న సమస్యలు పరీక్షించేందుకు ఆస్పత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో వయస్సుతో పాటు తలెత్తే కంటిలోని రెటీనా క్షీణత, కంటిలో తలెత్తే స్వయం రక్షిత వ్యాధులు, క్యాటరాక్ట్, గ్లాకోమా, చూపు మసకబారడం, థైరాయిడ్‌ కారణంగా తలెత్తే కంటి వ్యాధులు, దృష్టి వక్రీభవన దోషాల వంటి సమస్యలు ఇందులో ఉంటాయి.

గర్భధారణ సమయంలో చోటుచేసుకునే హార్మోన్‌ మార్పులు, మెనోపాజ్‌, స్వయం నిరోధక వ్యాధులు, ఇతర కారణాల వల్ల మహిళల్లో సంభవించే అవకాశం ఉన్న కంటి వ్యాధుల ముప్పును తగ్గించేందుకు ఆస్పత్రి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది.

ఈ సందర్బంగా డా.అగర్వాల్స్ ఐ హాస్పిటల్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌- ఆప్తమాలజిస్టు డాక్టర్‌ పలక్‌ మాట్లాడుతూ, “ కంటి స్వరూపం, జన్యు వక్రీకరణ, కంటి కురుపు, ఔట్‌పుట్‌ సహ కంటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఇతర కంటి విధులను లింగపరమైన తేడాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి మహిళలు రెట్టింపు సంఖ్యలో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పోషకాహార సప్లిమెంట్స్‌ తీసుకునే విషయంలోనూ డాక్టర్లను సంప్రదించాలి. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు యూవీ-నిరోధక సన్‌ గ్లాసెస్‌తో పాటు అంచులు ఉన్న టోపీలు ధరించాలి. కంటికి సంబంధించిన సౌందర్య సాధనాలు, కాంటాక్ట్ లెన్స్ ఉపయోగించేటప్పుడు పరిశుభ్రమైన పద్ధతులతో పాటు జాగ్రత్తలు పాటిస్తూ కంటి ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవాలి” అన్నారు.

గర్భదారణ, కంటి వ్యాధుల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ డాక్టర్ పలక్‌ , గర్భoదాల్చిన సమయంలో శరీరం ఎక్కువ నీటిని ఒడిసిపడుతుంది.ఇది కార్నియాను మందం చేసి కంటిలోని ముందరి ఉపరితలాన్ని మార్చుతుంది. ఈ మార్పుల కారణంగా కాంతిని కళ్లు చూసే తీరు మారి చూపు సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అంతే కాదు ఆ సమయంలో కంటి ఒత్తిడి కూడా స్వల్పంగా తగ్గుతుంది. గర్భిణులకు గెస్టెషనల్‌ డయాబెటీస్‌ తలెత్తినప్పుడు గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడి కొంతమందికి డయాబెటిక్ రెటినోపతి, కంటిలోని రక్తనాళాలు దెబ్బతినడం వల్ల దృష్టి సమస్యలు ఏర్పడతాయి. గర్భం కారణంగా కళ్లు పొడిబారడటం, కాంతిని చూస్తే తట్టుకోలేకపోవడం కూడా జరుగుతుంది. గర్భనిరోధక మాత్రలలోని హార్మోన్లు వాస్కులర్ మార్పులకు కారణమవుతాయి, పరోక్షంగా కంటి సమస్యలు తలెత్తుతాయని అన్నారు.

“గర్భిణులు కళ్లు సహ మొత్తం శరీరానికి పోషకాలు అందేలా చూసుకోవడం ముఖ్యం. ఆకుకూరలు, పండ్లు, నట్స్‌, ఒమెగా -3 అధికంగా ఉండే చేపలను వారు బాగా తినాలి. అన్ని సమయాల్లోనూ వారి తమ శరీరం హైడ్రేటేడ్‌గా ఉంచుకోవాలి” అన్నారు డాక్టర్‌ పలక్‌.

కంటి ఆరోగ్యం, మెనోపాజ్ మధ్య సంబంధంపై డాక్టర్ పలక్‌ మాట్లాడుతూ, మెనోపాజ్, పెరిమెనోపాజ్, శరీరం సహజంగా మెనోపాజ్‌కి మారే సమయంలో సాధారణంగా హర్మోన్లతో కూడిన ఈస్ట్రోజెన్లు క్షీణిస్తాయి. ఈస్ట్రోజెన్‌లు కార్నియాతో పాటు కంటికి స్పష్టంగా ఉండేలా చూసి వెలుపలి పొరకు రక్షణగా నిలిచి కాంతిని చక్కగా చూడగలిగేలా చేస్తాయి. ఈస్ట్రోజెన్లు క్షీణించినప్పుడు కళ్లలో తేమ తగ్గుతుంది. దీంతో కళ్లు పొడిబారి చూపు మసకబారుతుంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో కళ్లు పొడిబారడం అనే సమస్య రెట్టింపు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మహిళల్లో ఆటో ఇమ్యూనిటీకి గురైన అవకాశాలు కంటిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని డాక్టర్‌ పలక్‌ అన్నారు. “ఆటో ఇమ్యూన్ సమస్యలతో బాధపడుతున్న వారిలో 80% మంది మహిళలే. లూపస్, సోరియాసిస్, రైటర్స్ సిండ్రోమ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, యువెటిస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధుల కారణంగా తలెత్తే సమస్యల్లో కంటి వాపు కూడా ఒకటి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కళ్లు పొడిబారడం, కండ్లకలక వాపు, కార్నియా సన్నబడటం, ఇతర బాధాకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. యువెటిస్ నేరుగా కనుపాపలోని ద్రవాన్ని ప్రభావితం చేస్తుంది”.

స్వయం నిరోధక లోపం గ్రేవ్స్ వ్యాధి కారణంగా థైరాయిడ్ గ్రంధి (థైరాయిడ్ హార్మోన్ అధిక ఉత్పత్తికి దారితీస్తుంది) ఎక్కువ చురుగ్గా ఉంటుంది. ఇది పురుషుల కంటే స్త్రీలను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ అతి చురుగ్గా ఉండటం వలన కండ్లకలక (కంటిలోని తెల్లటి భాగం), కళ్లు పొడిబారటం, కాంతిని చూడలేకపోవడం, రెండుగా కనిపించడం, వాపు, కళ్లు ఎర్రబారడం వంటి అనేక సమస్యలు కలిగిస్తుంది. అదే తక్కువ థైరాయిడ్ హార్మోన్‌ తక్కువ ఉన్నట్టు అయితే కనురెప్పలు రాలిపోవడం, కళ్లు, ముఖం ఉబ్బడం వంటివి జరుగుతాయి. ప్రతీ 1,00,000 మంది స్త్రీలలో 16 మందిని థైరాయిడ్ కంటి వ్యాధులు ప్రభావితం చేస్తాయి. అదే పురుషుల్లో ఈ సంఖ్య 3 మాత్రమే.

పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉన్నందున, వయస్సు పైబడుతున్న కొద్ది వారిలో కంటి వ్యాధులు పెరిగే ముప్పు అధికంగా ఉంటుందని తెలిపారు డాక్టర్ పలక్‌. అలాగే గణాంకపరంగా చూస్తే పురుషుకల కంటే స్త్రీలు ఎక్కువ ప్రిస్క్రిప్షన్, ఓవర్ ది కౌంటర్ ఔషధాలు తీసుకుంటారు. ఈ మందులలో చాలా వరకు కంటికి సంబంధించి తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగించేవి ఉంటాయి. ఎక్కువ సేపు ఉండే మైగ్రేన్‌, తరచు రావడం, అధిక వైకల్యం, కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది మహిళలు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఫొటోఫోబియా సహ దృష్టి లోపాలు, కాంతిని చూడలేకపోవడం, తాత్కాలిక దృష్టి లోపం వంటి సమస్యలతో మైగ్రేన్‌ సాధారణంగా ముడిపడి ఉంటుంది.

తెలంగాణవ్యాప్తంగా ఈ నెలరోజులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, కంటి పరీక్షల ద్వారా మహిళలకు ముప్పుల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంపొందించుకోవడం జరుగుతుందని, తద్వారా మెరుగైన కంటి ఆరోగ్యం కోసం సమస్యలను త్వరగా గుర్తించేందుకు, త్వరగా చికిత్స అందించేందుకు దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

error: Content is protected !!