Dr.-Hypno-Padma-Kamalakar_365

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి14, 2023: మధురమైనది.. అమరమైనది ప్రేమేనని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డా.హిప్నోపద్మాకమలాకర్ అన్నారు. అలాంటి ప్రేమ పేరుతో మోసం చేస్తూ కొంతమంది తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారని ఆమె తెలిపారు.

జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చి తన సంతోషం తాను వెతుక్కుని వెళ్ళిపోతున్నారు. నిజమైన ప్రేమకు ఈ లోకంలో విలువ లేదని స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలకు, యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారన్నారు. లవ్ చేయడంలో తగ్గెదెలే అంటూ దుసుకుపోతున్న యువతేనని చెప్పారు.

నిజం చెప్పాలంటే ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు ప్రేమ వల్లే ”కొని” తెచ్చుకుంటున్నవేనన్నారు.ఈ ప్రపంచంలో ”అవసరం” కోసం ఎదుటివాడిని మోసం చేసేవారికన్నా..

వారి మీదున్న ”అక్కసు”తో తమను తాము మోసగించుకునే వారే ఎక్కువని చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవనం సాగించాలంటే ముందుగా వారి మధ్య ఉండాల్సింది ”నమ్మకం”మన్నారు.

Dr.-Hypno-Padma-Kamalakar_365

నేడు ఎంతమంది ప్రేమికుల్లో తమ వారిని పూర్తిగా నమ్ముతున్నారు?? మనం చదువుద్వారా సంపాదించిన జ్ఞానం,స్వతహాగా ఉన్న తెలివితేటలు మనకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యనుండి బైటపడటానికి ఉపయోగించాలన్నారు.

దురదృష్టం ఏమిటంటే మనకున్న జ్ఞానంతో,తెలివితో సమస్య’లను తెంపుకోవడం కన్నా తెచ్చుకోవడమే ఎక్కువై పోతోందని తెలిపారు. ప్రేమ దగ్గరకొచ్చే సరికి ఎక్కడలేని రాక్షసత్వం బైటికొచ్చి విలయతాండవం చేస్తుంటుంది.అస్సలు’మనసు” విప్పి మాట్లాడు కుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె తెలిపారు.

డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్, సైకో థెరపీస్ట్, హిప్నో థెరపీస్ట్
@ 9390044031