Tue. Dec 24th, 2024
Dr. Jitendra Singh launches Coffee Table Book titled 'Discovering the Heritage of Assam'

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిల్లీ అక్టోబరు 04 2020:ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదో), ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పించ‌నులు , అణుశక్తి, అంతరిక్ష శాఖల‌ స‌హాయ మంత్రీ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదివారం (ఈ రోజు) “డిస్కవరింగ్ ది హెరిటేజ్ ఆఫ్ అస్సాం” పేరుతో కాఫీ టేబుల్ పుస్త‌కాన్ని విడుద‌ల‌ చేశారు. అమితాబ్ బచ్చన్ ముందుమాటతో వెలువ‌డిన ఈ పుస్త‌కాన్ని పెంగ్విన్ సంస్థ ప్రచురించింది. గ్లేజుడ్‌ కాగితంపై చిత్రాలు, ఛాయాచిత్రాలతో కూడిన భారీ కాఫీ టేబుల్ పుస్తకం ఇది.ఈశాన్య భార‌త‌పు అతిపెద్ద రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ జాతి తెగల , ఉపజాతుల వారసత్వం, విశ్వాసం, నమ్మకాలు, సంప్రదాయాల సంగ్రహణ సంకలనంగా.. దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ పుస్తకం విడుదల సంద‌ర్భంగా మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రచయిత పదంపాని బోరాను అభినందించారు.

Dr. Jitendra Singh launches Coffee Table Book titled 'Discovering the Heritage of Assam'
Dr. Jitendra Singh launches Coffee Table Book titled ‘Discovering the Heritage of Assam’

వృత్తిరీత్యా ఆయన భారతీయ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్ -2009 బ్యాచ్) అధికారిగా ఉన్నాడు, అయినా కొన్ని సంవత్సరాలుగా తనను తాను నిష్ణాతుడైన రచయితగా త‌న స్థానాన్ని ఆయ‌న స్థిరపరచుకున్నాడు అని అన్నారు. భారత దేశపు ఈశాన్య ప్రాంతం విభిన్న సూక్ష్మ నైపుణ్యాలను ప్రతిబింబించే విషయాలలో ప్రత్యేకత కలిగిన ఒక నిష్ణాత రచయితగా తనను తాను స్థాపించుకున్నాడ‌ని ఆయ‌న అన్నారు. ఈశాన్య‌.

error: Content is protected !!