365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 10, 2025: బయోలాజికల్ ఈ లిమిటెడ్ సిఎస్‌ఆర్ విభాగమైన డాక్టర్ విజయ్ కుమార్ డాట్ల ఫౌండేషన్ బొల్లారంలో బీఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రారంభించింది.
ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణ కార్యక్రమాలు అందించి వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.
ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఫార్మా, టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీ & వెల్‌నెస్, డిజిటల్ కమ్యూనికేషన్ (ఐటీ/ఐటీఈఎస్), రిటైలింగ్ వంటి రంగాల్లో ఉచిత శిక్షణ అందించేందుకు ఈ కేంద్రం సిద్ధమైంది.
ఈ శిక్షణా కేంద్రంలో ప్రతి శిక్షణా కోర్సు మూడునెలలపాటు జరుగుతుంది. ప్రతి కోర్సును అనుభవజ్ఞులైన బోధకులు నిర్వహిస్తారు. ఏసనల్ కోర్సులకు ఎటువంటి విద్యార్హత అవసరం లేదు, అయితే పారిశ్రామిక కోర్సులకు కనీసం పదో తరగతి లేదా ఐటీఐ, డిప్లోమా లేదా డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
ఈ కేంద్రంలో శిక్షణ పొందే మహిళలకు చిన్న పిల్లల సంరక్షణ సేవలు కూడా ఉచితంగా అందించబడతాయి. దీనివల్ల వారు తమ పిల్లలను భద్రంగా ఉంచి శిక్షణపై పూర్తిగా దృష్టిపెట్టవచ్చు.
డాక్టర్ విజయ్ కుమార్ డాట్ల ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ త్రిషన్యరాజు మాట్లాడుతూ,
“నైపుణ్యాభివృద్ధి ద్వారా ప్రజలకు సాధికారత కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. జీహెచ్ఎంసీ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి, వారికి సుస్థిర జీవనోపాధి కల్పించడం మా బద్ధత. ఇది కేవలం శిక్షణ కేంద్రమే కాకుండా, సామర్థ్యాన్ని అవకాశంగా మార్చే విప్లవాత్మక ప్రయాణం” అని తెలిపారు.
డాక్టర్ విజయ్ కుమార్ డాట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ మోడల్ మార్కెట్ భవనాన్ని పునరుద్ధరించి ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటైంది.
ఇందులో:
తరగతి గదులు
క్యాంటీన్
కౌన్సెలింగ్ గది
ఫార్మాస్యూటికల్ ట్రైనింగ్ ల్యాబ్
16 సీట్ల ఐటీ/ఐటీఈఎస్ కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయి.
ఈ కేంద్రం ద్వారా ప్రతి మూడు నెలలకు 180 మంది అభ్యర్థులు శిక్షణ పొందే వీలుంది.ఇలా సంవత్సరానికి 600-720 మంది అభ్యర్థులు ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో శిక్షణ పొందవచ్చు.
సమాజాన్ని సాధికారం చేసే ప్రయోజనాలతో బీఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఆధునిక శిక్షణా మార్గదర్శకాలతో ముందుకు సాగుతోంది.