365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూఢిల్లీ, జూలై 16, 2025: స్మార్ట్ హోం అప్లయన్సెస్ విభాగంలో గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందిన డ్రీమ్ టెక్నాలజీ, ఇప్పుడు భారత్‌లో తమ ఆఫ్లైన్ ఉనికిని విస్తరించేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ రిటైల్ బ్రాండ్ క్రోమాతో భాగస్వామ్యం ప్రకటించింది.
అమెజాన్ ఇండియాలో విజయవంతమైన ప్రస్థానానికి కొనసాగింపుగా, ఇప్పుడు రిటైల్ స్టోర్ల ద్వారా వినియోగదారులకు మరింత చేరువవుతోంది.
ఈ భాగస్వామ్యంతో, డ్రీమ్ ఇండియా ఉత్పత్తులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20కి పైగా మెట్రో, టైర్ 1 & టైర్ 2 నగరాల్లోని ఎంపికైన క్రోమా స్టోర్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “డ్రీమ్ జోన్” ను సందర్శించి, బ్రాండ్‌కి చెందిన ఆధునిక శుభ్రత, గ్రూమింగ్ ఉత్పత్తులను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు. ఇందులో రోబోటిక్ వ్యాక్యూమ్స్, కార్డ్‌లెస్ స్టిక్ క్లీనర్లు, తడి-పొడి క్లీనింగ్ మెషీన్లు, హైటెక్ గ్రూమింగ్ గ్యాడ్జెట్లు ఉంటాయి.
డ్రీమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను శర్మ మాట్లాడుతూ..“ఇండియా మా కోసం అత్యంత ఉత్సాహభరితమైన మార్కెట్. క్రోమాతో భాగస్వామ్యం డ్రీమ్ ప్రయాణంలో కీలకమైన మైలురాయి. వినియోగదారులు స్టోర్లకు వచ్చి మా ఉత్పత్తులను ప్రత్యక్షంగా చూడగలగడం, అవగాహన పెరగడమే కాకుండా నమ్మకాన్ని సైతం పెంచుతుంది.”

ఈ భాగస్వామ్యాన్ని పురస్కరించుకుని జూలై 15 నుండి 20 వరకు, క్రోమా స్టోర్లలో డ్రీమ్ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, 10% అదనపు డిస్కౌంట్ (IDFC, Amex, HSBC, BOB క్రెడిట్ కార్డులపై), అలాగే నో కాస్ట్ EMI ఆప్షన్లు లభిస్తున్నాయి.
ఇతర ముఖ్యమైన సేవలు..
- 2 సంవత్సరాల వారంటీ గ్రూమింగ్ ఉత్పత్తులపై
- 1 సంవత్సరం వారంటీ క్లీనింగ్ పరికరాలపై
- టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్, పికప్ & డ్రాప్ సపోర్ట్, ఆన్-సైట్ ఇన్‌స్టాలేషన్ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
డ్రీమ్ ఇటీవలే కృతి సనన్‌ను తన తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించగా, ఇప్పుడు ఆన్‌లైన్ విజయాన్ని ఆఫ్లైన్ లోకి విస్తరించడంతో భారత మార్కెట్‌పై సంస్థ నిబద్ధత మరింత స్పష్టమైంది.
స్మార్ట్ గృహోపకరణాలు లాంటి విభాగాల్లో వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు రిటైల్ స్పేస్ కీలకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఆఫ్లైన్ విస్తరణ ద్వారా డ్రీమ్ భారత వినియోగదారుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ముందడుగు వేసింది.