Thu. Nov 14th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 23,2023: భూమి బాగుంటేనే భవిష్యత్తు ఉంటుందని యోగ గురు బి.సరోజిని రామారావు, లయన్.జి.కృష్ణ వేణి,డా.హిప్నో పద్మా కమలాకర్, లయన్.జి.కృష్ణ వేణి తెలిపారు. ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ లో భారతీయ యోగ సంస్థాన్, డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కలిగించారు.

ఆమె మాట్లాడుతూ సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమే నన్నారు. అలాంటి భూమి పరిరక్షణపై సరైనా అవగాహన లేదన్నారు. పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించకుండా ఉంటే చాలని తెలిపారు.

అటు పర్యావరణం, వాతావరణంతో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అవసరమవు తున్నాయన్నారు. నేల తల్లి బాగుంటేనే… ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుం టామని చెప్పారు. అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే స్తుంటే భవిష్యత్తు అంధకారమేనని తెలిపారు.

ప్రకృతి నియమా లకు విరుద్ధంగా మనిషి చేస్తున్న పనుల వల్ల భూ గోళం అ మితంగా వేడెక్కిపోతోందన్నారు. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడడం వల్ల వాయు కాలుష్యంపెరుగుతోందన్నారు. పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందన్నారు.

వ్యవసాయంలో ర సాయనాలు విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పది లంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మార్చేస్తున్నామని చెప్పారు.ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికాభివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారమని చెప్పారు.

భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామ ర్థ్యంతో వినియోగించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇందిరా పార్క్ ను ఎప్పుడూ సుబ్రంగా ఉంచుకుందామని, అడువుల సంరక్షణ, పునర్‌ పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ చేస్తామని ప్రమాణాలు చేసారు.

ఈ కార్యక్రమంలో జి.కృష్ణ వేణి పేపర్ తో చేసిన పెన్ను లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్.జి.కృష్ణ వేణి, గీత, జ్యోతి, హిత, రామారావు, వెంకటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, దేవేందర్ సింగ్, రాజు నరసింహ, సింగ్, శ్రీలత, సుభాషిణి, యోగ గురువులు పాల్గొన్నారు.

error: Content is protected !!