himachalpradesh

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఫిబ్రవరి 21,2023: హిమాచల్ ప్రదేశ్‌ లోని కాంగ్రా జిల్లాలో భూకంపం సంభవించింది. సోమవారం రాత్రి 10:38 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంప కేంద్రం ధర్మశాలలో 10 కిలోమీటర్ల లోతులో ఉంది.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్వల్పంగా భూమి కంపించడంతో చాలా మంది ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

హిమాచల్ లో 1905లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంప జోన్ నాలుగు, ఐదులో వచ్చింది. ఆయా జోన్లలో కంగ్రా, చంబా, లాహౌల్, కులు, మండి వంటి ప్రాంతాలున్నాయి.

himachalpradesh

వీటిని భూకంపాలకు ఎక్కువగా గురయ్యే ప్రాంతాలుగా గుర్తించారు శాస్త్రవేత్తలు. ఏప్రిల్ 4, 1905 తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా కాంగ్రాలో 20వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూకంపం కారణంగా సుమారు లక్ష భవనాలు ధ్వంసమవగా, 53 వేలకు పైగా పశువులు కూడా బలయ్యాయి.