Sat. Dec 21st, 2024
Earthquake__

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 22,2023: ఆరుదేశాల్లో భూకంపం వచ్చింది. భారతదేశం,ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాలలో బలమైన భూకంపం సంభవించింది. దీంతో పాటు పాకిస్థాన్, చైనా సహా పలు దేశాల్లో చాలా సేపు భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా , ఇస్లామాబాద్‌తో సహా బలూచిస్తాన్‌లోని వివిధ నగరాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి.

భూకంపం కారణంగా 11 మంది మృతి చెందగా,100 మంది గాయపడినట్లు సమాచారం. భారత్‌,ఆఫ్ఘనిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, చైనాల్లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం తర్వాత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. పాకిస్థాన్‌లో భూకంపం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఆరుగురు గాయపడినట్లు సమాచారం.

Earthquake__

మీడియా నివేదికల ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా విపత్తు నిర్వహణ అథారిటీ నివేదిక ప్రకారం, ప్రావిన్స్‌లో ఇంటిపైకప్పు, గోడలు కూలిపోయిన సంఘటనలలో ఇద్దరు మరణించగా, ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. భూకంపం కారణంగా ఇక్కడ ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో 180 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు భూకంప కేంద్రం వెల్లడించింది.

అదే సమయంలో, స్వాత్ జిల్లా పోలీసు అధికారి షఫివుల్లా గండాపూర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది మంది మరణించారని, 100 మందికి పైగా గాయపడ్డారని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాబిలో ప్రకంపనల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గాయపడ్డారు.

అదే సమయంలో, భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో బహ్రెయిన్-కలాం రహదారి బంద్ అయింది. టీవీ చానెళ్లలో ప్రసారమైన దృశ్యాలు చూసి భయాందోళనలకు గురైన ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భూకంపం సమయంలో, రావల్పిండి మార్కెట్లలో తొక్కిసలాటజరిగింది.

ఆఫ్ఘనిస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు..

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 77 కి.మీ దూరంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని పెషావర్‌, కోహట్‌, స్వాబీ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీంతో పాటు లాహోర్, క్వెట్టా, రావల్పిండిలో కూడా భూకంపం సంభవించింది. భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

Earthquake__

స్థానిక మీడియా ప్రకారం, పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలా, గుజరాత్, సియాల్‌కోట్, కోట్ మోమిన్, మధ్ రంజా, చక్వాల్, కోహట్, గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. భారతదేశంలో కూడా, అనేక రాష్ట్రాలలో విస్తరించి ఉన్న ఉత్తర ప్రాంతంలో తీవ్రంగా భూకంపం సంభవించింది.

భారత్‌లోనూ కంపించిన భూమి..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మంగళవారం రాత్రి 10.19 గంటలకు బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్. భూప్రకంపనలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

ఢిల్లీ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌లో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడికక్కడ గందరగోళం నెలకొంది. రెండు మూడు సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్ల లేదు.

పాకిస్తాన్ లో180 కి.మీ లోతులో ప్రకంపనలు..

earthquake

భూకంపం తర్వాత పాకిస్తాన్ లో భయానక వాతావరణం నెలకొందని పాకిస్థాన్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయాల్సి వచ్చింది. పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 180 కి.మీ. లోతులో భూ ప్రకంపనలు వచ్చాయి.

లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, జీలం, షేక్‌పురా, స్వాత్, నౌషేరా, ముల్తాన్, స్వాత్, షాంగ్లా తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే పాకిస్థాన్‌లో భూకంపాలు సర్వసాధారణం. 2005లో ఇక్కడ అత్యంత ఘోరమైన భూకంపం సంభవించి 74,000 మందికి పైగా మరణించారు.

error: Content is protected !!