365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,మే 23: ఈస్ట్- వెస్ట్ సీడ్ ఇండియా నుంచి ప్రవేశపెట్టిన అధిక దిగుబడుల మిర్చి హైబ్రిడ్ రకమైన లావా, వైరస్లను తట్టుకునే శక్తి గల లక్షణాలతో ఉత్పత్తి వ్యయం తగ్గించడంపై సానుకూల ప్రభావం కనబర్చగలుగుతోంది. అంతేగాకుండా ఈ మహమ్మారి సమయంలో మార్కె ట్ కు త్వరగా చేరుకునేందుకు కూడా ఇది తెలంగాణ లోని చిన్న కమతాల రైతులకు తోడ్పడుతుంది.
లావా అనేది ఎర్రటి, పొట్టి విభాగానికి చెందింది. లీఫ్ కర్ల్ (ఆకు ముడుత) వైరస్ నిరోధకతను కలిగిఉంటుంది. ఎన్నో సార్లు పంట తీసుకున్న తరువాత కూడా కాయ పరిమాణం నిలకడగా ఉంటుంది. ఇవన్నీ కూడా పంట సంరక్షణ, కూలీ వ్యయాలపై రైతులకు ఆదాలను అందిస్తాయి. స్పైస్ బోర్డ్ వివరాల మేరకు కారం (ఎస్ హెచ్ యు: 85కె -90కె), కలర్ వాల్యూ (ఏఎస్టీఏ:75-80), ఒలియొరెసిన్ శాతం (17.5%)ల ఆదర్శ సమ్మేళనా న్నిఅందించే లావా, ఈ రకాన్ని ఒలియొరెసిన్ ఎక్స్ ట్రాక్షన్ కు, ఎగుమతులకు అనువైందిగా చేస్తుంది. పంట తీసుకోవడంలో కాయ పరిమాణానికి సంబంధించి చక్కటి నిలకడను అందిస్తుంది. ఎకరాకు రూ.8,000 నుంచి రూ.10,000 దాకా కూలీల వ్యయాన్ని తగ్గించుకునేందుకు రైతులకు తోడ్పడుతుంది.
‘‘మిరప లో ఈస్ట్- వెస్ట్ సీడ్ 25 ఏళ్ల బ్రీడింగ్ నైపుణ్యాన్ని కలిగిఉంది. ఆంధ్రప్రదేశ్ లో 11000 మందికి పైగా రైతులు లావా రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ హైబ్రిడ్ రకం మంచి గాఢతను కలిగిఉంటుంది, అందుకే దీని పేరు కూడా బాగా సరిజోడుగా నిలిచింది. దీంతో రైతులు తమ పెట్టుబడులపై చక్కటి ప్రతిఫలాలను పొందగలుగుతారని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఈస్ట్- వెస్ట్ సీడ్ ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ సంజయ్ గెహ్లాత్ అన్నారు.