Sun. Sep 8th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, నవంబర్ 10,2023:నకిలీ కాల్ సెంటర్ మోసం కేసులో కునాల్ గుప్తాకు చెందిన రూ.67.23 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది.

PMLA, 2002 నిబంధనల ప్రకారం ED ఈ చర్య తీసుకుంది.ఈ కేసులో కునాల్ గుప్తా, అతని కుటుంబ సభ్యులు, కంపెనీలు,అతని సహచరుల ఆస్తులను ఏజెన్సీ జప్తు చేసింది.

మేట్ టెక్నాలజీస్, ఇతరులు నకిలీ కాల్ సెంటర్ మోసం కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 నిబంధనల ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ED తెలిపింది.

కునాల్ గుప్తా, అతని కుటుంబ సభ్యులు, కంపెనీలు, అతని సహచరులకు చెందిన మొత్తం రూ.67.23 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.

స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల్లో 35 బ్యాంకు ఖాతాలు, 14 కార్లు, 12 స్థిరాస్తులు (మొత్తం విలువ రూ. 61.84 కోట్లు)గా ఉన్నాయని దర్యాప్తు సంస్థ తెలిపింది.

కాగా, స్థిరాస్తుల్లో గోవాలోని ఒక రిసార్ట్,గోవాలోని ఒక విల్లా, కోల్‌కతా, బెంగళూరులలో 10 వాణిజ్య కార్యాలయాలు, ఫ్లాట్లు, అపార్ట్‌మెంట్లు,భూములు ఉన్నాయి.

error: Content is protected !!