365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 6,2024: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల, జాతీయ సేవా పథకం విభాగం ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ మాకె నామ్” కార్యక్రమంలో భాగంగా విశ్వవిద్యాలయం హెల్త్ సెంటర్ ఆవరణలో శనివారం వివిధ రకాల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ హాజరై మొక్కలను నాటి, పర్యావరణంలో మొక్కల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, మొక్కలను నాటడం కాదు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత NSS వాలంటీర్లపై ఉందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సి. నరేంద్ర రెడ్డి, డాక్టర్ ఎం. మాధవి, సీనియర్ ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, హెల్త్ సెంటర్ ఇన్చార్జ్ డాక్టర్ సి. పద్మవేణి, బోధన, బోధనేతర సిబ్బంది, హెల్త్ సెంటర్ సిబ్బంది, NSS అధికారులు,వాలంటీర్లు పాల్గొన్నారు.