365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హల్ద్వానీ, మార్చి 9,2023: ఉత్తరాఖండ్ రాష్ట్రం హల్ద్వానీలోని రాజేంద్ర నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.
స్థానికుల కథనం ప్రకారం.. ఇంట్లో గొడవల కారణంగా రిక్షా పుల్లర్ అనిల్ సక్సేనా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అనిల్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

తమ్ముడి మృతి విని షాక్ అయిన అన్నయ్య అతని మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంటి గొడవలతో మనస్తాపానికి గురైన తమ్ముడు సూసైడ్ చేసుకోగా, అన్నకు ఈ వార్త తెలియగానే షాక్ కు గురయ్యాడు.
సోదరుడి మరణవార్త విన్న అన్నయ్య అనూప్ గుండెపోటుతో మృతి చెందాడు. అనూప్ ఫరీద్‌పూర్ నుంచి హల్ద్వానీకి తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో విషాదం నెలకొంది.