365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, ఢిల్లీ, జూలై 16, 2021: దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా భవన నిర్మాణ రంగంలో ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు కేంద్ర ఇంధన , నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్ కె సింగ్ తెలిపారు. ఇంధన సామర్ధ్య పెంపుదలకు తమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను మంత్రి వివరించారు.
బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రూపొందించి అమలు చేయనున్న సుస్థిర ఆవాసాల లక్ష్యం : ఇంధన సామర్ధ్య పెంపుదల 2021 నూతన కార్యక్రమాలను మంత్రి ఈ రోజు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. భవన నిర్మాణ రంగంలో ఇంధన వినియోగ సామర్ధ్యాన్ని ఎక్కువ చేయడానికి చర్యలను అమలు చేస్తామని అన్నారు. ఇంధన వినియోగ సామర్ధ్యాన్ని పెంపొందించే విధంగా భవన డిజైన్లను రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు, ఈ అంశంలో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించి వీటిని పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని అన్నారు.
పారిశ్రామిక రంగం తరువాత భవన నిర్మాణ రంగం ప్రస్తుతం విద్యుత్తును ఎక్కువగా వినియోగిస్తున్నదని సింగ్ అన్నారు. అయితే,2030 నాటికి పరిశ్రమలకు మించి ఈ రంగంలో విధ్యుత్ వినియోగం అయ్యే అవకాశం ఉందని అన్నారు. భవన నిర్మాణ రంగ ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం నివాస, వాణిజ్య భవనాల్లో ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించే అంశంపై దృష్టి సారించి పనిచేస్తున్నదని అన్నారు.
విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధనశాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నివాస భవనాలలో ఇంధన-సామర్థ్య స్థాయిలను పెంచడానికి బీఈఈ అమలుచేస్తున్న కార్యక్రమాలుసహాయపడతాయని, దీనివల్ల స్థిరమైన ఆవాసాల రూపకల్పనజరుగుతుందని అన్నారు.రానున్నరోజుల్లో స్మార్ట్హోమ్ జీవావరణవ్యవస్థ,ప్రతి నిర్మాణంలోఇంధనపొదుపుసామర్ధ్యఅంశాలుతప్పనిసరిఅంశాలుగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇంధనశాఖ సహాయ మంత్రి క్రిషన్ పాల్ గుర్జార్ మాట్లాడుతూ ఇంధన సామర్ధ్యం పెరిగితే తక్కువ ఇంధనాన్ని వినియోగించడానికి వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. తమ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు భవన నిర్మాణ రంగంలో మార్పులు వస్తాయని అన్నారు.
తమ శాఖ ప్రారంభించిన కార్యక్రమాలతో ఇంధన సామర్ధ్యాన్ని ఎక్కువ చేస్తాయని ఇంధన శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ అన్నారు. ఈ రంగంలో ప్రపంచానికి భారతదేశం మార్గదర్శకంగా ఉంటుందని అన్నారు.
ప్రారంభించిన కార్యక్రమాలు:
· భవన సేవలకు కోడ్ సమ్మతి విధానాలు, కనీస శక్తి పనితీరు అవసరాలు పర్యావరణహిత 2021 తో ధృవీకరణ వ్యవస్థను నెలకొల్పడం
· ఇంధన-సామర్ధ్య గృహాలను నిర్మించడానికి వెబ్ ఆధారిత ‘ది హ్యాండ్‌బుక్ ఆఫ్ రెప్లికేబుల్ డిజైన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్’ సహకారంతో వివిధ నమూనాలతో భవనాలకు రూపకల్పన చేయడం
· ఇంధన సామర్ధ్యాన్ని ఎక్కువ చేసే నిర్మాణ సామగ్రి కోసం ప్రమాణాలను రూపొందించి ఆన్‌లైన్ డైరెక్టరీని ఏర్పాటు చేయడం
· బీఈఈ రూపొందించిన ప్రమాణాలకు అనుగుణంగా భవనాల డిజైన్లను రూపొందించడానికి నిర్మాణ్ అవార్డులను అందించడం.
· తక్కువ ఇంధనాన్ని వినియోగించే విధంగా వ్యక్తిగత గృహాల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ఆన్‌లైన్ స్టార్ రేటింగ్ ఇవ్వడం. నిపుణులు తమ ఇళ్ల ఇంధన అవసరాల కోసం తమకు నచ్చిన ఉత్తమ విధానాలను ఎంచుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
· ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఇసిబిసి) 2017 ఎకో నివాస్ సంహిత (ఇఎన్ఎస్) 2021 పై 15 వేలకు పైగా ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులకు శిక్షణ అందించడం.
భారతదేశం 75 వ స్వాతంత్ర్య వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ను నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాల్లో విద్యుత్ మంత్రిత్వ శాఖ 75 వారాల పాటు 75 కార్యక్రమాలను నిర్వహిస్తుంది.