elli-aruna
elli-aruna

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,హైద‌రాబాద్,జూన్ 16,2022: ‘క్యాస్ట్‌ డెమొక్రసీ’ సిద్ధాంతకర్త, ఎల్లి నవల రచయిత్రి అరుణ కన్ను మూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్నఆమె హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయారు. అరుణ… ‘మాటిగరి’ అనువాదకుడు కుందేటి వెంకటేశ్వరరావు కుమార్తె, కవి సౌదా జీవన సహచరి. ఫూలే, అంబేడ్కర్‌ భావజాల పతాకగా నిలిచారు.

elli-aruna

ఆమె భౌతిక కాయాన్ని ఖాజా గూడలోని స్పర్ష్‌ ఆసుపత్రి నుంచి కృష్ణా జిల్లా కంకిపాడు మండలం, ఉప్పులూరు గ్రామానికి తరలించనున్నారు. ఆమె అంత్యక్రియలు గురువారం నిర్వహించనున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.