365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏలూరు,31 డిసెంబర్‌  2021 : కర్నూలు, విజయనగరంలలో విజయవంతంగా తమ రెస్టారెంట్లను  తెరిచిన తరువాత ప్రపంచ ప్రసిద్ధ బిర్యానీ ప్యారడైజ్‌, తమ 46వ ఔట్‌లెట్‌ను ఏలూరులో తెరిచింది. వేంగి రాజుల కాలం నుంచి కూడా అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం హేలాపురి. దక్షిణ భారతీయ సంస్కృతులు, శక్తివంతమైన పాలనల సమ్మేళనం ఏలూరు.  అత్యంత అందమైన ముంజులూరు, గుబ్బాలలతో  ఖచ్చితమైన వీకెండ్‌ గేట్‌వేగా నిలుస్తుంది. ఈ నూతన  ప్యారడైజ్‌ ఏలూరు కీర్తికిరీటంలో ఓ కలికితురాయిగా  నిలుస్తుంది. మరీముఖ్యంగా క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ ఇది ప్రారంభం కావడం విశేషం.

అతిథులు అత్యుత్తమ బిర్యానీ, కబాబ్‌,మరెన్నో అంశాలను ఒకే చోట అత్యున్నత నాణ్యత, అసాధారణ పరిశుభ్రత,జాగ్రత్తతతో  ఆస్వాదించవచ్చు. ప్రస్తుత సమయంలో అవసరమైన భద్రతా ప్రమాణాలకనుగుణంగా ఆహారాన్ని అందిస్తామనే భరోసాను ప్యారడైజ్‌ అందిస్తుంది. అగ్రహారంలోని ఎల్‌ఐసీ బిల్డింగ్‌లో  1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ రెస్టారెంట్‌ ఉంది. ఏలూరులోని ఆహారాభిమానులు,చుట్టు పక్కల ప్రాంతాల వాసులు ప్యారడైజ్‌ రుచులు, దాని,ప్రతిష్టాత్మక బిర్యానీలు,  కబాబ్‌లు,డెస్సర్ట్స్‌తో తమ జిహ్వచాపల్యంను సంతృప్తి పరుచుకోవచ్చు.

ఈ నూతన రెస్టారెంట్‌ ఆవిష్కరణ గురించి అలీ హేమతి, ఛైర్మన్‌– ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘ మా 45వ   ఔట్‌లెట్‌ను ప్రారంభించిన ఒక నెల లోపుగానే ప్యారడైజ్‌ను ఏలూరుకు తీసుకురావడమన్నది ట్రేడ్‌మార్క్‌ ప్యారడైజ్‌ బిర్యానీకి ఉన్న డిమాండ్‌ను వెల్లడిస్తుంది. అదొక్కటే కాదు ఈ ఆవిష్కరణ అనేది క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకల వేళ జరిగింది. ఇది పండుగలకు సరికొత్త రుచులను జోడిస్తుంది. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల వాసులు మాత్రమే కాదు, వీకెండ్‌ గేట్‌వేల కోసం తెలంగాణా నుంచి ఇక్కడకు వచ్చేవారు కూడా ఇప్పుడు మా ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఈ నగరం విభిన్న సంస్కృతుల నిలయం. చారిత్రాత్మక నగరం కూడా ఇది. కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో అత్యంత వైభవాన్ని ప్రదర్శించింది ఈ నగరం.  ఈ ఆవిష్కరణతో హైదరాబాదీ బిర్యానీ రుచులను  ఏలూరు వాసుల చెంతకు తీసుకురావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.

డాక్టర్‌ కజీమ్‌ హేమతి, డైరెక్టర్‌– ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  మాట్లాడుతూ ‘‘ హైదరాబాద్‌తో పాటుగా మిగిలిన ప్రాంతాలలో  ఏ విధంగా అయితే ప్యారడైజ్‌ బిర్యానీని అభిమానిస్తారో అదే రీతిలో ఇక్కడ కూడా ఆదరణ పొందుతుందనే అంశాన్ని  ఏలూరులో మా  నూతన ఔట్‌లెట్‌ స్ఫురణకు తీసుకురానుంది. ఇది మా 46వ ఔట్‌లెట్‌. దశాబ్దాలుగా మా అత్యంత నాణ్యమైన ఆహారాన్ని అందించడం కొనసాగించడంతో పాటుగా ప్రతిసారీ  మరింత ఉత్తమంగా దీనిని తీర్చిదిద్దుతుండటం మాకు ఆనందంగా ఉంది. ప్యారడైజ్‌ వారసత్వాన్ని కొనసాగించడంలో మా సిబ్బంది, నాయకత్వ అంకిత భావం అపూర్వం’’అని అన్నారు

శ్రీ గౌతమ్‌ గుప్తా, సీఈవో– ప్యారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘  ఏలూరులో అత్యంత అందమైన అంశాలలో వాటర్‌ఫాల్స్‌  మాత్రమే కాదు ఇక్కడ దేవాలయాలు కూడా సందర్శకులకు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అత్యంత పసందైన రుచుల విందు ఆరగించేందుకు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశాలలో ఒకటిగా ప్యారడైజ్‌ నిలుస్తుంది. భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా  ఎక్కువ మంది అభిమానించే బిర్యానీ కేంద్రంగా ప్యారడైజ్‌ నిలుస్తుంది.  2021 సంవత్సరాంతానికి మేము దీనిని ఏలూరుకు తీసుకువచ్చాము. క్రిస్మస్‌,న్యూ ఇయర్‌ వేడుకల వేళ ప్యారడైజ్‌ను ఇక్కడకు తీసుకురావడం యాధృశ్చికం. ఈ సీజన్‌ను అత్యంత ఆహ్లాదకరంగా ఈ ఆవిష్కరణ మారుస్తుంది’’అని అన్నారు.

ఈ ఆహార గొలుసుకట్టు సంస్థ లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో  ఓ సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో బిర్యానీలు సర్వ్‌ చేసిన రెస్టారెంట్‌ చైన్‌గా ఖ్యాతికెక్కింది. 2017లో, 70 లక్షల బిర్యానీలను ప్యారడైజ్‌ వడ్డించింది. 2018లో ఇది 90లక్షల మార్కును అధిగమించింది. ఆసియా ఫుడ్‌ కాంగ్రెస్‌ లో  అత్యుత్తమ బిర్యానీని వడ్డించిన అత్యుత్తమ రెస్టారెంట్‌గా,గోల్డెన్‌ స్పూన్‌ అవార్డు ను ఇండియా ఫుడ్‌ ఫోరమ్‌ వద్ద 2018లో అందుకుంది.   తెలంగాణా స్టేట్‌ హోటల్స్‌ ,అసోసియేషన్స్‌,  జీహెచ్‌ఎంసీ, టైమ్స్‌ ఫుడ్‌ అవార్డ్‌, ప్రైడ్‌ ఆఫ్‌ తెలంగాణా, లైఫ్‌టైమ్‌ అావ్‌మెంట్‌ అవార్డు వంటి ఎన్నో ప్రశంసలు ఇది అందుకుంది.