365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,మార్చి 30,2023: ఇప్పటివరకూ పలురకాల వస్తువులు కానీ ఉత్పత్తులు గానీ కొనుగోలు చేయడానికి ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్ మెంట్(ఈఎంఐ) సౌకర్యం ఉండేది. కొన్నికంపెనీలైతే ఖరీధైన బట్టల కొనుగోలు సమయంలో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అందిస్తున్నాయి.
ఐదు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు కోల్‌కతా నుంచి ‘భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు’ను ప్రారంభించనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణీకులకు భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు టికెట్స్ కు ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని ఇండియన్ రైల్వే వెల్లడించింది.
ఐఆర్‌సిటిసి కోల్‌కతా జోనల్ ఆఫీస్ సీనియర్ సూపర్‌వైజర్ కింకర్ రాయ్ చౌదరి బోల్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు’ మే 20న కోల్‌కతా నుంచి బయలుదేరుతుందని తెలిపారు. ఈ ప్రత్యేక రైలు ఐదు జ్యోతిర్లింగాలు – ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, నాగేశ్వర్, శని శింగనాపూర్‌తో పాటు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ , షిర్డీ సాయిబాబా ఆలయాలకు తీసుకెళ్తుంది.
కోల్‌కతాతో పాటు, రైలు బండల్ జంక్షన్, బుర్ద్వాన్ జంక్షన్, బోల్పూర్-శాంతి నికేతన్, రాంపూర్హాట్ జంక్షన్, పాకూర్, సాహెబ్‌గంజ్, భాగల్పూర్, ముజఫర్‌పూర్, పాట్లీపుత్ర తదితర స్టేషన్లలో ఆగుతుంది.
ఈ రైలు ప్రయాణం 11రాత్రులు,12 పగళ్లు ఉంటుందని తెలిపారు. ఈ రైలులో ఎయిర్ కండిషనింగ్‌తో కలిపి మొత్తం 656 సీట్లు ఉన్నాయి. దీంతో పాటు పర్యాటకుల కోసం మూడు ప్రత్యేక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు.
రాయితీ సీట్ల ప్రకారం ఒక్కో వ్యక్తికి రూ.20 వేల 60, రూ.31 వేల 800, రూ.41 వేల 600. రైల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ఈ ప్యాకేజీలో 33 శాతం తగ్గింపు కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా, భారతీయ రైల్వే ఈ రైలులో ప్రయాణించే పర్యాటకులకు టిక్కెట్లకు మూడు నుంచి18 నెలల ఈఎంఐ సౌకర్యాన్ని ఇస్తోంది.