Thu. Jul 25th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జూలై 9,2024:అనువైన డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ అందించడం ద్వారా భారత ఎంఎస్ఎంఈల డిజిటల్ ప్రస్థానాన్ని వేగవంతం చేసేందుకు టెలికం దిగ్గజం వీ (Vi)‌లో ఎంటర్‌ప్రైజ్ విభాగమైన వీ బిజినెస్,దేశీయంగా దిగ్గజ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థల్లో ఒకటైన పేయూ (PayU) వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

ఎంఎస్ఎంఈల పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన సర్వీసులు అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది. వినూత్నమైన పేమెంట్ సొల్యూషన్స్, అనువైన ఆఫర్స్ ఇంజిన్, బై-నౌ-పే-లేటర్ ఆప్షన్లు, వాట్సాప్‌తో నిరాటంకంగా అనుసంధానం మొదలైనవన్నీ కూడా భారత ఎంఎస్ఎంఈల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి.

ఎంఎస్ఎంఈల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రోగ్రాం రెడీఫర్‌నెక్ట్స్ ద్వారా ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేకంగా రూపొందించిన విస్తృత డిజిటల్ సాధనాలను విశిష్ట ధరలకి వీ బిజినెస్ అందిస్తోంది.

ఎంఎస్ఎంఈలు తమ డిజిటల్ వర్క్‌ప్లేస్‌ను, వ్యాపారాన్ని, కస్టమర్లతో లావాదేవీలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించే లొకేషన్ ట్రాకింగ్, గూగుల్ వర్క్‌స్పేస్, పర్సనల్ క్లౌడ్ స్టోరేజ్, మొబైల్ సెక్యూరిటీ సొల్యూషన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.

“భారత్‌లోని చిన్నమధ్య తరహా వ్యాపారాలు డిజిటల్ వైపు మళ్లేందుకు తోడ్పడటంపై మాకు గల నిబద్ధతకు పేయూతో భాగస్వామ్యం నిదర్శనంగా నిలవగలదు అని వొడాఫోన్ ఐడియా చీఫ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ అరవింద్ నెవాతియా తెలిపారు.

“వ్యాపారాల్లో క్షేత్రస్థాయిలో పరివర్తన తెచ్చే శక్తి, డిజిటల్ ఆవిష్కరణలకు ఉందని పేయూ విశ్వసిస్తుంది. భారతీయ ఎంఎస్ఎంఈల డిజిటల్ పరివర్తనకు తోడ్పడాలన్న మా నిబద్ధతను, వీ బిజినెస్‌తో భాగస్వామ్యం సూచిస్తుంది” అని పేయూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిర్బన్ ముఖర్జీ తెలిపారు.

వీ బిజినెస్ ,పేయూ సంయుక్తంగా అందిస్తున్న ఎంఎస్ఎంఈ సర్వీసుల వివరాలివీ:

1. సమీకృత పేమెంట్ సొల్యూషన్స్:  యూపీఐ,రూపేపై లావాదేవీల చార్జీలేవీ లేకుండా, అలాగే దేశీయ డెబిట్,క్రెడిట్ కార్డులపై తగ్గించిన రేట్లు, నెట్ బ్యాంకింగ్ వంటి మాధ్యమాల ద్వారా వీ బిజినెస్-పేయూ భాగస్వామ్యం నిరాటంకమైన పేమెంట్ గేట్‌వే సేవలు ప్రవేశపెడుతోంది.

2. వాట్సాప్ స్టోర్: వ్యాపార సంస్థలు తమ కస్టమర్లకు చక్కని షాపింగ్ అనుభూతినిచ్చేందుకు, కొత్త ఉత్పత్తులను కనుగొనడంలో వారికి తోడ్పాటు అందించడం నుంచి చెల్లింపులను స్వీకరించే వరకు అంతా వాట్సాప్‌లోనే నిరాటంకంగా జరిగిపోతుంది.

చెకవుట్ ప్రక్రియలో బాదరబందీని తగ్గిస్తుంది. వివిధ యాప్లు లేదా వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ చేయాల్సిన సమస్య తగ్గి కస్టమర్లను కొనుగోలుదార్లగా మార్చేందుకు తోడ్పడుతుంది.

3. బై నౌ పే లేటర్ (Buy Now Pay Later (BNPL)): కొనుగోలు సమయంలోనే ఎంఎస్ఎంఈలు పూర్తి మొత్తాన్ని అందుకునేందుకు, అదే సమయంలో తక్కువ లావాదేవీ చార్జీలతో కస్టమర్లు సరళతరమైన చెల్లింపు ఆప్షన్లను పొందేందుకు బీఎన్‌పీఎల్ ఉపయోగపడగలదు.

4. చెకవుట్ సమయంలో అనుకూలీకరించిన ఆఫర్లు: వినియోగదారుల కోసం ప్రమోషన్ క్యాంపెయిన్‌లను సృష్టించేందుకు, వాటిని నిర్వహించేందుకు పేయూ  ‘ఆఫర్ ఇంజిన్’, ఎంఎస్ఎంఈలకు సహాయకరంగా ఉంటుంది. కస్టమర్ విశ్వసనీయతను పెంచడంతో పాటు కొనుగోలు పరిమాణం మెరుగుపడేందుకు కూడా ఉపయోగపడగలదు.

5. ఉద్యోగుల ఉత్పాదకత మరియు సహకారాన్ని పెంపొందించే సాధనాలు: పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ఉద్యోగుల మధ్య సహకారం, ఉత్పాదకతను పెంచేందుకు ఎంఎస్ఎంఈలకు వీ బిజినెస్ పలు ఆఫర్లు కూడా అందిస్తోంది. కేవలం రూ. 349కే బిజినెస్ ప్లస్ ప్లాన్‌తో అపరిమిత కాలింగ్, 60 జీబీ డేటాతో వార్షికంగా రూ. 65,280 విలువ చేసే గూగుల్ వర్క్‌స్పేస్, లొకేషన్ ట్రాకింగ్, పర్సనల్ క్లౌడ్ స్టోరేజీ, మొబిలిటీ సెక్యూరిటీ మొదలైన ప్రయోజనాలను వీ కాంప్లిమెంటరీగా అందిస్తోంది. 

వీటిని అందుకునేందుకు ఎంఎస్ఎంఈలు ఈ దిగువ పోర్టల్‌ను సందర్శించవచ్చు: https://www.myvi.in/business/enterprise-segments/smb/msme-readyfornext-digital-assessment

MSME ఆఫరుప్రయోజనాలు
రూ. 349/-(నెలవారీ అద్దె)అపరిమిత వాయిస్ లోకల్ /నేషనల్ / రోమింగ్, 60GB డేటా, 3000 ఎస్ఎంఎస్
బండిల్స్: సోనీలివ్, మొబైల్ సెక్యూరిటీ, లొకేషన్ ట్రాకింగ్, Google వర్క్‌స్పేస్, ISD రేట్ కటర్, పర్సనల్ క్లౌడ్ 50GB (కొత్త ఆవిష్కరణ)

Also read : Empowering MSMEs of Bharat: Vi Business and PayU Partner to Accelerate Digital Growth with exclusive offers

Also read : Maruti Suzuki Announces Enhanced Warranty Programmes

Also read :Cloudnineexpands in Hyderabad market, announces the launch of third hospital at Kompally

Also read :New Zealand teens rank among the best for creative thinking

ఇదికూడా చదవండి: న్యూయార్క్‌లోని యూయన్ ప్రధాన కార్యాలయంలో యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రాతినిధ్యం వహించడానికి తెలంగాణ నుంచి ఐదు మంది యువ ఆవిష్కర్తలను ఎంపిక చేసిన 1యం1బి గ్రీన్ స్కిల్స్ అకాడమీ

Also read :1M1B Green Skills Academy Selects 5 young innovators from Telangana to Represent at the Activate Impact Summit at the UN Headquarter in New York

ఇదికూడా చదవండి: ఛానెల్ ప్యాకేజీలకు విధించిన సీలింగ్ పరిమితిని తొలగించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా

ఇదికూడా చదవండి: రష్యన్ సైన్యంలో భాగమైన భారతీయుల ను స్వదేశానికి రప్పించడానికి ఒప్పందం

Also read :What kind of diet should be followed in order to strengthen teeth..?