Tue. Nov 19th, 2024

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నేషనల్, నవంబర్ 19, 2024: ఎన్విరో ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ లిమిటెడ్ (“ఎన్విరో ఇంజినీర్స్” లేదా “కంపెనీ”) తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)కి సంబంధించిన బిడ్/ఆఫర్ 2024 నవంబర్ 22 (శుక్రవారం) ప్రారంభమై, 2024 నవంబర్ 26 (మంగళవారం) ముగుస్తుందని ప్రకటించింది. ఈ పబ్లిక్ ఇష్యూలో ఒక్కో షేరుకు ₹140 నుంచి ₹148 ధర శ్రేణి నిర్ణయించింది. కనీసం 101 షేర్లకు, ఆపై 101 గుణిజాల ముల్యాంకనంలో బిడ్లు దాఖలు చేయవచ్చు.

ఈ ఆఫర్‌లో భాగంగా 3,86,80,000 కొత్త షేర్లను జారీ చేయడం,52,68,000 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించడం జరుగుతుంది. ఒక్కో షేరు ముఖ విలువ ₹10. అర్హత గల ఉద్యోగులకు 1,00,000 షేర్లు రిజర్వు చేశాయి.

ప్రస్తుత నిధుల వినియోగం:

  • (i) వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంలో
  • (ii) హైబ్రిడ్ యాన్యుటీ ఆధారిత పీపీపీ విధానంలో, ఉత్తరప్రదేశ్‌లోని మథురాలో ‘మథురా సీవరేజ్ స్కీమ్’ ప్రాజెక్టు కోసం 60 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ నిర్మించడానికి అనుబంధ సంస్థ ఈఐఈఎల్ మథురా ఇన్‌ఫ్రా ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నిధులు సమకూర్చడం
  • (iii) రుణాల చెల్లింపులు
  • (iv) ఇనార్గనిక్ వృద్ధి సాధన కోసం కొనుగోళ్ల ద్వారా.

ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డర్లు:

  • సంజయ్ జైన్ – 21,34,000 షేర్లు
  • మనీష్ జైన్ – 21,34,000 షేర్లు
  • రితు జైన్ – 5,00,000 షేర్లు
  • శచీ జైన్ – 5,00,000 షేర్లు

హెమ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఈ ఇష్యూకి ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.

error: Content is protected !!