365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 2,2025: కోట్ల మంది ఉద్యోగులకు శుభవార్త! ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఉపసంహరణ (PF Withdrawal) నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ అర్హత కలిగిన పీఎఫ్ బ్యాలెన్స్‌లో 100 శాతం వరకు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

100% పీఎఫ్ డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చు..?

ఫుల్ అమౌంట్(Full Withdrawal) కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతించ నున్నారు. అది కూడా పదవీ విరమణ (Retirement): 55 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్ అయితే.శాశ్వత వైకల్యం (Permanent Disability). ఉద్యోగం కోల్పోతే (Unemployment): ఒక నెల నిరుద్యోగం తర్వాత 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉద్యోగం కోల్పోయి 12 నెలలు పూర్తయితే మొత్తం 100% అర్హత కలిగిన బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ (Voluntary Retirement) లేదా శాశ్వతంగా దేశం విడిచి వెళ్లినప్పుడు.

ముఖ్య గమనిక: కొత్త నిబంధనల ప్రకారం, సభ్యులు తమ రిటైర్‌మెంట్ భద్రత కోసం 25% కనీస బ్యాలెన్స్‌ను పీఎఫ్ ఖాతాలో ఉంచాల్సి ఉంటుంది.

కొత్త ప్రక్రియ ఏమిటి..?

(పాక్షిక ఉపసంహరణ)ఇదివరకటి 13 సంక్లిష్టమైన ఉపసంహరణ నిబంధనలను రద్దు చేసి, EPFO వాటిని కేవలం మూడు సరళీకృత కేటగిరీలుగా విభజించింది. కేటగిరీదేనికి ఉపయోగపడుతుందికొత్త సడలింపులు ముఖ్యమైన అవసరాలుఅనారోగ్యం, విద్య, వివాహంవిద్య కోసం 10 సార్లు, వివాహం కోసం 5 సార్లు వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

గృహ అవసరాలుఇల్లు కొనడం, కట్టడం లేదా రుణం చెల్లించడంప్రత్యేక పరిస్థితులుప్రకృతి వైపరీత్యాలు, ఊహించని ఆర్థిక ఇబ్బందులుఈ కేటగిరీలో డబ్బు తీసుకోవడానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు (Self-declaration).

మరిన్ని ముఖ్య మార్పులు..

సర్వీస్ పీరియడ్ తగ్గింపు: పాక్షిక ఉపసంహరణ కోసం కనీస సర్వీస్ కాలాన్ని 12 నెలలకు తగ్గించారు.క్లెయిమ్ ఆటో సెటిల్‌మెంట్: కొంత మొత్తానికి సంబంధించిన క్లెయిమ్‌లను డాక్యుమెంట్లు లేకుండా ఆటోమేటిక్‌గా సెటిల్ చేసే అవకాశం కల్పించారు.

పాత నిబంధన: గతంలో పాక్షిక ఉపసంహరణ కోసం కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 3 సార్లు మాత్రమే అనుమతి ఉండేది.ఈ మార్పులు ఉద్యోగులకు ఆర్థిక అవసరాల కోసం తమ పీఎఫ్ డబ్బును మరింత సులభంగా, వేగంగా పొందేందుకు వీలు కల్పిస్తాయి.