
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 15 మార్చి, 2022: హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఒకటి, పరిశ్రమతో అనుసంధానం ద్వారా అనుభవపూర్వక అభ్యసనాన్ని అందించడం లక్ష్యంగా కలిగిన ఇథేమ్స్ కాలేజ్ తన ఫ్లాగ్ షిప్ ఇన్ క్యుబేషన్ ప్రోగ్రామ్‘ఇథేమ్స్ ఇల్యాబ్స్’ ను ప్రకటించింది. విద్యార్థుల మనస్సుల్లో ఆంత్రప్రెన్యూర్ షిప్ ఆలోచనలను రేకెత్తించడం దీని లక్ష్యం.ప్రఖ్యాత ఇకో సిస్టమ్ సంస్థలైన టిఐఇ, ఐఐఐటి హైదరాబాద్ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఇథేమ్స్ ఇల్యాబ్స్’ నుఇథేమ్స్ కాలేజ్ రూపొందించింది. ఈ కార్యక్రమం నేడిక్కడ తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక,కాలేజ్ యేట్ విద్య కమిషనర్, ఐఏఎస్ అధికారి శ్రీ నవీన్ మిత్తల్, టిఐఇ గ్లోబల్ వైస్ చైర్మన్ మురళి బుక్కపట్నం, టిఐఇ హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేశ్ రాజు, ఐఐఐటి హైదరాబాద్ సిఐఇ హెడ్ ప్రొఫెసర్ రమేశ్ లోగనాథన్, ఇథేమ్స్ కాలేజ్ చైర్మన్ కాళీ ప్రసాద్ లచే ప్రారంభించబడింది.
ప్రపంచంలో స్టార్టప్ లకు సంబంధించి మూడో అతిపెద్ద ఇకో సిస్టమ్ ను భారతదేశం కలిగిఉంది. ఇది 15% కంటే అధిక వైఒవై వార్షిక వృద్ధి సాధించగలదని అంచనా. సంస్థలు సంచలనాత్మక శక్తిసామర్థ్యాలు గల స్టార్టప్స్ గా నిరూపించుకుంటే, వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు వీసీలు మరింతగా ముందుకు వస్తారు. చాలా చిన్న వయస్సు లోనే ఆంత్రప్రెన్యూర్ షిప్ ను చేపట్టేందుకు, తమ కలల్ని నిజం చేసుకునేందుకు నేడు విద్యార్థులకు అపరిమిత అవకాశాలు ఉన్నాయి. భారతీయ ఆర్థిక వ్యవస్థ సైతం వేగంగా విస్తరిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినియోగ బ్రాండ్లను సృష్టించేందుకు మరెన్నో అవకాశాలను అందిస్తోంది. విద్యార్థులు ఆంత్రప్రెన్యూర్ షిప్ చేపట్టేలా చేయాలనే ఏకైక ఆశయంతో పలు ప్రోగ్రామ్ లు,కార్యక్రమాల ద్వారా ఈథేమ్స్ కాలేజ్ ఈ ఎక్స్ క్లూజివ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది.
ఇథేమ్స్ ఇల్యాబ్స్ ప్రారంభం సందర్భంగా ఇథేమ్స్ కాలేజ్ చైర్మన్ కాళీప్రసాద్ గాదిరాజు మాట్లాడుతూ, ‘‘మా ప్రఖ్యాత భాగస్వాములైన టిఐఇ, ఐఐఐటిలతో కలసి ఇథేమ్స్ ఇల్యాబ్స్ ను ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం.

విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేందుకు, యుక్తవయస్సులోనే ఆంత్రప్రెన్యూర్ షిప్ గురించి అవగాహన కల్పించేందుకు వీలుగా ఇంజినీ రింగేతర విద్యార్థుల కోసం ఈ తరహాలో మొదటిదిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లుగా’’ తెలిపారు.
‘‘యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలు ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్ ను అభివృద్ధి చేయడాన్ని మనం చూశాం.మొదటిసారిగా డిగ్రీ స్థాయిలో ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ను మేం ప్రవేశపెట్టాం. అది ఎంతో మందికి ఉపాధి కల్పించేలా వినియోగ బ్రాండ్లు, మరెన్నో కంపెనీలు నిర్మించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తుంది’’ అని అన్నారు.
ఇథేమ్స్ ఇల్యాబ్స్ ప్రోగ్రామ్ అనేది విద్యార్థుల శక్తిసామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమ నిపుణులచే రూపొందించబడింది. ఇథేమ్స్ ఇల్యాబ్స్ ప్రోగ్రామ్ దిగువ విధంగా నిర్వహించబడుతుంది.
- స్ఫూర్తి – సమావేశాలు, మోటివేషనల్ టాక్స్, ఏఎంఏ సెషన్స్ లాంటి వాటి ద్వారా ఆంత్రప్రెన్యూర్ షిప్ దిశగా విద్యార్థులకు స్ఫూర్తి కలిగించడం
- పునాది – ఆంత్రప్రెన్యూర్ షిప్ పై కోర్సు కరిక్యులమ్ ద్వారా ప్రాథమిక అవగాహన కల్పించడం; కోర్సుఎరా, టిఐఇ ప్రోగ్రామ్స్ తో వాటిని జోడించడం
- డిస్కవర్ – ఇ- క్లబ్స్, హ్యాకథాన్ల నిర్వహణ, స్టార్టప్ ఐడియా పిచింగ్ పోటీలు లాంటి వాటితో వినూత్న ఆలోచనలతో విద్యార్థుల కమ్యూనిటీని రూపొందిం చడం,
- ఐడియా వాలిడేషన్ – ఐడియా వాలిడేషన్ బూట్ క్యాంప్ ల నిర్వహణ ద్వారా ఐడియాలను వృద్ధి చేసుకునేందు కు ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేయడం
- సీడింగ్ – విద్యార్థులు తమ ఆలోచనలను వృద్ధి చేసుకునేందుకు వీలుగా కొద్దిపాటి సీడ్ ఫండ్ తో వారికి సాయం
- మద్దతు – ఆఫీస్ స్పేస్, లీగల్, సెక్రటేరియల్ సర్వీసెస్, ల్యాబ్స్, ప్రి- ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ లాంటివి అందించడం ద్వారా విద్యార్థులు తమ ఆలోచనలను కార్యరూపంలోకి పెట్టేందుకు తోడ్పడడం.