365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 10 జనవరి 2022: విద్యుత్ వాహనాల కోసం భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ ప్రాంగణం ఈ వీలర్స్ మొబిలిటీ నూతన సంవత్సరాన్ని తమ నూతన ద్విచక్ర విద్యుత్ వాహన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ నూతనంగా డిజైన్ చేసిన ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ సదుపాయాన్ని వేగవంతంగా డెలివరీలు అందించేందుకు నిర్మించేందుకు నిర్మించడం జరిగింది,భారతదేశంలో విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సైతం తోడ్పడనుంది.
ఈ ఫుల్‌ఫిల్‌మెవంట్ కేంద్రం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున యశోద నగర్ ఏరియాలో కార్యకలాపాలు ప్రారంభించింది, దీనిని అత్యాధునిక సాంకేతికత ,అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. వినియోగదారులకు ఇంటి ముంగిట డెలివరీ అనుభవాలను అందించాలనే కంపెనీ లక్ష్యం చేరుకునేందుకు అతిపెద్ద ముందడుగుగా ఈ నూతన కేంద్రం నిలుస్తుంది.
ఈవీలర్స్ ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం విప్లవాత్మకమైనది. ఈ నూతన సస్టెయినబల్ సరఫరా చైన్‌ను ప్రత్యేకంగా విద్యుత్ వాహన తయారీదారులు తమ వ్యాపారాలను విస్తరించడంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు సహాయపడే రీతిలో తీర్చిదిద్దారు. అదే సమయంలో, భారతదేశంలో ఈవీ స్వీకరణ ప్రక్రియను ఇది వేగవంతం చేయనుంది.
ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం తెరువడం గురించి వాసు దేవారెడ్డి బీరాల, సీఈవో అండ్ ఫౌండర్– ఈవీలర్స్ మొబిలిటీ మాట్లాడుతూ ‘‘అత్యంత అందుబాటు ధరలలో ఉండటంతో పాటుగా సమర్థవంతమైన పనితీరు కారణంగా ఇటీవలి కాలంలో ఈవీలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇటీవలి కాలంలో తమ రోజువారీ ప్రయాణ అవసరాల కోసం ఎక్కువ మంది కొనుగోలుదారుల ఎంపికగా ఇది నిలుస్తుంది.
తమ రోజువారీ రవాణా అవసరాలను తీర్చుకునేందుకు సౌకర్యవంతమైన పరిష్కారాలను కోరుకునే ప్రజలకు నమ్మకమైన బ్రాండ్‌గా ఈవీలర్స్ మొబిలిటీ నిలుస్తుంది. మా నూతన ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రంను హైదరాబాద్‌లో ప్రారంభించడంతో, ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన రవాణా పరిష్కారాలను అందించే దిశగా మేము తీవ్రంగా కృషి చేస్తున్నాము’’ అని అన్నారు.
విద్యుత్ వాహన వ్యాపారాన్ని నిర్వహించడానికి విస్తృతస్థాయిలో లాజిస్టిక్స్, మౌలికవసతుల మద్దతు అవసరం. విద్యుత్ వాహన తయారీదారులు విస్తృత శ్రేణిలో సవాళ్లను మార్కెట్‌లో తమ ఉత్పత్తుల విక్రయాలలో ఎదుర్కొంటున్నారు. వేర్‌హౌసింగ్ సదుపాయాలు తగినంతగా లేకపోవడం, క్లిష్టతరమైన ప్యాకేజింగ్ ,హ్యాండ్లింగ్ ప్రక్రియలు వంటివి ఈవీ తయారీదారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లుగా నిలుస్తున్నాయి.
డీలర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయడంతో పాటుగా తుది మైలు డెలివరీ సైతం వీరికి సవాల్‌గా నిలుస్తుంటుంది. ఈ వీలర్స్ ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ సేవలతో, ఇప్పుడు ఓఈఎంలు మార్కెట్‌కు కేవలం ఒక మోడల్‌తో ప్రవేశించడంతో పాటుగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల చెంతకు తీసుకువెళ్లవచ్చు. తమ సేల్స్ నెట్‌వర్క్స్‌ను అనుకూలంగా మార్చడం కోసం మరిన్ని మోడల్స్‌ను ఉత్పత్తి చేయడం కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.
‘‘ఈవీలర్స్ మొబిలిటీ ఇప్పుడు మూడు నూతన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటకలలో తెరువడానికి ప్రారంభించింది. ప్రస్తుతం రెండు ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఢిల్లీ,హైదరాబాద్‌లలో నిర్వహిస్తుంది. హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ కేంద్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విద్యుత్‌వాహనాల మార్కెట్‌కు మద్దతునందించనుంది. ఈ నూతన ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలు లీడ్ టైమ్‌ను మెరుగుపరచడంతో పాటుగా సరఫరా చైన్‌ను మెరుగుపరచడంతో పాటుగా వినియోగరులకు చేరే సమయాన్ని తగ్గిస్తుంది’’ అని అన్నారు.
‘‘ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రంలో విస్తృత శ్రేణి వాహనాలు అయినటువంటి ఈ–స్కూటర్లు, ఈ–మోటర్‌సైకిల్స్, ఈ–బైసైకిల్స్, ఈహోవర్‌బోర్డ్స్ మరియు ,ఈ స్కేట్ బోర్డ్స్ ను ప్రదర్శించడంతో పాటుగా తమ అవసరాలకనుగుణంగా సరైన ఈవీని వినియోగదారులు కనుగొనేందుకు సహాయపడుతుంది’’ అని అనంత రెడ్డి, మేనేజింగ్ పార్టనర్–ఈవీ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం, హైదరాబాద్ అన్నారు.
భారతదేశంలో విద్యుత్ వాహనాల స్వీకరణలో అత్యుత్తమ పాత్రలను ఈ వీలర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రం పోషించనుంది. ఈ కంపెనీ ఇప్పటికే ఎంతోమందది విద్యుత్ వాహన తయారీదారులతో భాగస్వామ్యం చేసుకోవడంతో పాటుగా ఈ రంగంలో అతిపెద్దగా మారేందుకు ప్రణాళిక చేస్తుంది.రాబోయే దశాబ్ద కాలంలో ఇయర్ ఆన్ ఇయర్ 90% విద్యుత్ వాహన పరిశ్రమ వృద్ధి చెందుతుందని అంచనా. ఎంతోమంది ఈవీ తయారీదారులు ఈవీలర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్‌ను తమ డెలివరీ ప్రక్రియను సౌకర్యవంతంగా,సమర్ధవంతంగా మార్చుకునేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు.