365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 25 ,2023:దేశీయ స్టాక్‌ మార్కె్ట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. వరుసగా ఐదో సెషన్లోనూ బెంచ్‌ మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ పతనమయ్యాయి. దీంతో ఇవి నాలుగు నెలల కనిష్ఠానికి చేరాయి.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించకపోవడం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారడం, ముడి చమురు ధరలు పెరగడం, కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉండటమే ఇందుకు కారణాలు. పరిస్థితులు సద్దుమణిగేంత వరకు ఇన్వెస్టర్లకు ఆందోళన తప్పదు.

టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ గైడెన్స్‌ ఆశాజనకంగా లేకపోవడం ట్రేడర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఫారిన్‌ పోర్టుపోలియో ఇన్వెస్టర్లు రూ.4,236 కోట్ల విలువైన స్టాక్స్‌ అమ్మగా రూ.3,569 కోట్ల పెట్టుబడితో డీఐఐలు నెట్‌ బయర్స్‌గా అవతరించారు.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లా్‌ట్‌గా 83.19 వద్ద స్థిరపడింది. క్రితం సెషన్లో 64,571 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 64,619 వద్ద మొదలైంది. 64,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది.

రెండు గంటల్లోనే ఇంట్రాడే కనిష్ఠం 63,912కు చేరుకుంది. చివరికి 522 పాయింట్ల నష్టంతో 64,049 వద్ద ముగిసింది. బుధవారం 19,286 వద్ద ఆరంభమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,347 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది.

19,074 వద్ద కనిష్ఠానికి చేరుకుంది. మొత్తంగా 159 పాయింట్ల నష్టంతో 19,122 వద్ద క్లోజైంది. బ్యాంకు నిఫ్టీ 319 పాయింట్లు పతనమై 42,832 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభపడగా 40 నష్టపోయాయి. టాటాస్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో, టాటా కన్జూమర్, ఎస్బీఐ టాప్ గెయినర్స్. అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, ఐచర్ మోటార్స్ టాప్ లాసర్స్.

నేడు ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 3.73 శాతం పెరిగింది. పీఎస్‌యూ బ్యాంకు, మెటల్స్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.

నిఫ్టీ 50 అక్టోబర్‌ నెల ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,200 వద్ద రెసిస్టెన్సీ, 19,120 వద్ద సపోర్టు ఉన్నాయి. ఈ స్థాయి వద్ద సూచీకి మద్దతు దొరక్కపోతే మరింత పతనం కావొచ్చు.

ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కోల్‌ ఇండియా, టొరంట్‌ ఫార్మా, ఐఓబీ, ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ పతనంలో ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎల్‌టీ, ఎయిర్‌ టెల్‌ కంట్రిబ్యూషన్‌ చాలా ఎక్కువగా ఉంది.

ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌లో 97.3 లక్షల షేర్లు నేడు చేతులు మారాయి. నష్టాల మార్కెట్లోనూ బాలకృష్ణా ఇండస్ట్రీస్‌, బీఎస్‌ఈ, ప్రెస్టీజ్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్స్‌ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి.

ఏజిస్‌ లాజిస్టిక్స్‌, అదానీ టోటల్‌ గ్యాస్‌, అతుల్‌, అదానీ విల్మార్‌, గుజరాత్‌ గ్యాస్‌, పాలీ ప్లెక్స్‌, వీ మార్ట్‌ షేర్లు 52 వారాల కనిష్ఠానికి తగ్గాయి. డ్రీమ్ ఫోక్స్‌ సర్వీసెస్ క్యూ2 లాభం పెరగడంతో ఐదు శాతం నష్టాల్లోంచి షేర్లు పుంజుకున్నాయి.

విల్‌స్పన్‌ ఇండియా షేర్లకూ ఇలాగే జరిగింది. నెట్‌వర్క్‌ 18 నష్టాలు రూ.32 కోట్ల నుంచి రూ.218 కోట్లకు పెరగడంతో షేర్లు 4 శాతం పతనమయ్యాయి. ఎన్టీపీసీలో 10.1 లక్షల షేర్లు చేతులు మారాయి.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709