365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 21,2024:ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో వివిధ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని ఈనెల 29 వరకు పొడిగించారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు బై.పి.సి స్ట్రీమ్ కోర్సుల్లో దరఖాస్తు చేసుకునే తేదీని పెంచినట్లు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్. పి. రఘురామిరెడ్డి తెలిపారు. జూలై 12వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
తొలి విడతలో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రిజిస్ట్రార్ సూచించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.pjtsau.edu.in ను సందర్శించాలని సూచించారు.