365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జులై 1,2023: శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యాన డిప్లమా లో చేరేందుకు గాను విద్యార్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించేందుకు చివరి తేదీని జూలై14 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఓ ప్రకటన తెలిపారు. https://skltshu.ac.in/

ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో రెండు ప్రభుత్వ ఉద్యాన పాలిటెక్నిక్ లు, మరో రెండు ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా, ప్రతి కళాశాలలో 40 మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రవేశం కల్పిస్తున్నారు. https://skltshu.ac.in/
ఉద్యాన పంటల సాగులో నూతన నూతన పరిజ్ఞానాన్ని, సాంకేతికతను ఎప్పటికప్పుడు రైతులకు అందించేందుకు కావలసిన మానవ వనరులను తయారు చేయడమే థ్యేయంగా విద్యార్థులకు భోధన, శిక్షణ అందిస్తున్నట్లు హార్టీకల్చర్ వర్సిటీ ఉపకులపతి బీ.నీరజ ప్రభాకర్ తెలిపారు. https://skltshu.ac.in/