365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,జైపూర్,ఫిబ్రవరి 12,2023: రాజస్థాన్‌లో హోంగార్డ్స్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని హోంగార్డ్ డిపార్ట్‌మెంట్ కింద మొత్తం 3,842 పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులకు ఉపయోగపడనుంది.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లు home.rajasthan.gov.in లేదా sso.rajasthan.gov.inని సందర్శించడం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రాజస్థాన్‌లోని హోంగార్డ్ డిపార్ట్‌మెంట్‌లో రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12, 2023 నుంచి ప్రారంభమైంది. రాజస్థాన్ హోంగార్డ్ కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2023 వరకు ఉండగా. ఈతేదీని ఇప్పుడు 28 ఫిబ్రవరి వరకు పొడిగించారు. అభ్యర్థులు చివరి తేదీలోపు హోంగార్డ్ దరఖాస్తును సమర్పించాలని సూచించారు అధికారులు.
విద్యా అర్హత వయో పరిమితి..?
హోంగార్డు పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, దరఖాస్తును సమర్పించిన తర్వాత, వారు అనేక రౌండ్ల ఎంపికలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తుదారుల వయస్సు పరిమితి. వయస్సు కనీసం18 సంవత్సరాలు ఉండాలి.
గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. అభ్యర్థులకు దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ కేటగిరీలకు 250 రూపాయలుగా ఉంది. ఎస్సీ, ఈడబ్ల్యూ, ఎంబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
పురుష అభ్యర్థులు 162 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. పురుష అభ్యర్థులకు మాత్రమే ఛాతీ 86 సెంటీమీటర్లు, సాధారణ విస్తరణ 81 ఉండాలి. మహిళా అభ్యర్థులకు మాత్రమే బరువు కనీసం 47.5 కిలోలు ఉండాలి. ఉండాలి.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
ముందుగా SSO రాజస్థాన్ sso.rajasthan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
మీ SSO IDని సృష్టించండి.
మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
వివరాలను పూర్తిచేసి, మీ దరఖాస్తును సమర్పించండి.
మీ చివరి దరఖాస్తు ప్రింటవుట్ తీసుకోండి.