365 తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జూలై 23,2025: నగరంలో వరద ముప్పుకు గురవుతున్న ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. మియాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి పరిధిలోని వరద నిలిచే ముఖ్య రహదారులను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు.

కొత్తగూడ చౌరస్తాలో ఇటీవల వరద నీరు నిలిచిన ఆర్‌యూ‌బీ (RUB) స్థలాన్ని కమిషనర్ పరిశీలించి, అక్కడ ఆటోమేటిక్ డీవాటరింగ్ పంపులు పనిచేయకపోవడమే కారణమని అధికారులు తెలిపారు.

ప్రస్తుతం వాటికి మరమ్మతులు చేసి, పంపులను తిరిగి పనిచేసేలా చేశామని స్పష్టం చేశారు. అదనంగా హైడ్రా పంపులను కూడా సిద్ధంగా ఉంచి, నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

Read This also… MG M9 – India’s Presidential Limousine Launched at ₹69.90 Lakhs..

మాన్సూన్ ఎమర్జెన్సీ DRF బృందాలు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్టాటిక్ టీమ్స్‌ను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సౌకర్యాలు కలగజేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ తనిఖీల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జాయింట్ CP గజరావు భూపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బయోడైవర్సిటీ పరిధిలోని నీరు నిలిచే ప్రాంతాల పరిశీలన చేపట్టారు. వంతెనలపై నీరు వెళ్లే రంధ్రాల్లో మట్టి చేరకుండా చూడాలని సూచించారు.

ఇంద్రానగర్‌లో గమన్ ఆసుపత్రి వద్ద నీరు నిలిచిన ప్రాంతాన్ని కూడా పరిశీలించిన కమిషనర్, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వరద నీరు వెళ్లే నాలా గతంలో కబ్జా చేయబడిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ నాలాను పునరుద్ధరించాలంటూ అధికారులను ఆదేశించారు.

వర్షం పడిన వెంటనే చేరుతున్న సిల్ట్‌ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వరద నివారణతోపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు.