Fri. Nov 8th, 2024

365తెలుగు.కామ్ ఆన్‌లైన్ న్యూస్,తిరుపతి, జూలై,23, 2022: తిరుపతి శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలకు శనివారం అంకురార్పణ నిర్వహించ నున్నారు. జూలై 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి.

KODANDARAMA swamy

ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ఠ, శయనాధివాసం, రెండో రోజు పవిత్ర సమర్పణ, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.

KODANDARAMA swamy

ఇద్దరికి రూ.500/- చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, చివరిరోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

error: Content is protected !!