Fri. Nov 22nd, 2024
Facebook outlines
Facebook outlines
Facebook outlines

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్‌ 2021 ఃనేడు ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు  క్రియేటర్ల కోసం అతిపెద్ద కార్యక్రమాన్ని-‘క్రియేటర్‌ డే ఇండియా’ శీర్షికన  నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కంపెనీ తమ ప్లాట్‌ఫామ్స్‌లో  వెలుగొందుతున్న అగ్రశ్రేణి ధోరణులు వెల్లడించడంతో పాటుగా  భారతదేశంలో  తమ అతిపెద్ద  క్రియేటర్‌ అవగాహన, సమర్థత కార్యక్రమం www.bornoninstagram.com  ఆవిష్కరించింది.

‘క్రియేటర్‌ డే ఇండియా’ లో క్రియేటర్లు అయినటువంటి ఫైసు; కుషా కపిల, అవేజ్‌ దర్బార్‌, డాలీ సింగ్‌, ఆశీష్‌ చంచలానీ వంటి వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని క్రియేటర్లు తమ కెరీర్‌లను  వృద్ధి చేసుకోవడంతో పాటుగా తమ వ్యక్తిగత బ్రాండ్‌  మెరుగుపరుచుకోవడం, వారి సంక్షేమానికి మద్దతునందించడం లక్ష్యంగా చేసుకుని నిర్వహించారు. అలాగే అత్యుత్తమంగా ఈ అంశాలను నిర్వహిస్తున్న వారి నుంచి స్ఫూర్తిని పొందేలా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పంచుకున్న  కొన్ని టాప్‌ ట్రెండ్స్‌లో…

·ఫేస్‌బుక్‌పై ఫుడ్‌ అనేది ఓ విభాగంగా తన ఆధిపత్యం కొనసాగిస్తుంది. భారతదేశంగా ఫేస్‌బుక్‌పై ఈ తరహా పేజీలన్నీ అత్యుత్తమంగా ప్రదర్శన  కనబరుస్తున్నాయి.

·ఇన్‌స్టాగ్రామ్‌పై  లఘు వీడియో ఫార్మాట్‌  రీల్స్‌కు ఆదరణ పెరుగుతుంది. భారతదేశంలో సృజనాత్మకతను ఇది ప్రజాస్వామ్యీకరిస్తుంది

·ఇన్‌–స్ట్రీమ్‌ యాడ్స్‌ సహాయంతో  ఫేస్‌బుక్‌పై  క్రియేటర్‌ మానిటైజేషన్‌ వ్యాప్తి

ఫేస్‌బుక్‌ ఇండియా నుంచి అతిపెద్ద క్రియేటర్‌ విద్యా కార్యక్రమం

ఈ కంపెనీ భారతదేశంలో  తమ అతిపెద్ద క్రియేటర్‌ విద్య ,సమర్ధత కార్యక్రమం www.bornoninstagram.com  ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనిద్వారా క్రియేటర్‌ వనరులను మరింతగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

Facebook outlines
Facebook outlines

పరాస్‌ శర్మ, డైరెక్టర్‌ ఆఫ్‌ మీడియా పార్టనర్‌షిప్స్‌, ఫేస్‌బుక్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘ తెలంగాణాకు చెందిన క్రియేటర్లు ప్రధానస్రవంతిలోకి వెళ్లే ధోరణులను సృష్టిస్తున్నారు,ప్రాచుర్యంపొందిన సంస్కృతికి ఓ ఆకృతిని అందిస్తున్నారు. వారి సృజనాత్మతను వెలికి తీయడంతో పాటుగా జీవనోపాధికీ సహాయపడటంలో  మా వేదికలు  అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండటం పట్ల మేము సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో క్రియేటర్‌  వ్యవస్ధను నిర్మించి, వృద్ధి చేయాలనే మా నిబద్ధతకనుగుణంగా, మా నూతన కార్యక్రమంతో, మేము కేవలం మార్కెట్‌లో  విద్యా కంటెంట్‌ పరంగా ఉన్న అభ్యాస అంతరాలను పరిష్కరించడంతో పాటుగా ప్రతి ఒక్కరికీ దీనిని చేరువ చేయనున్నాం.  వారు అభ్యసించడం, సంపాదించడం,వారి కమ్యూనిటీని ఇన్‌స్టాగ్రామ్‌పై వృద్ధి చేయడంలో సహాయపడటాన్ని ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది. ఈ అవకాశాన్ని క్రియేటర్లు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము’’అని అన్నారు.

‘బోర్న్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రామ్‌’ కార్యక్రమాన్ని తొలుత 2019లో  ప్రారంభించారు కానీ, క్రియేటర్లు అభ్యసించేందుకు స్వీయ వేగంతో  కూడిన ఈ–అభ్యాస కోర్సుగా  మారిన ఈ కార్యక్రమ ఆకృతి  కారణంగా ఇది చెప్పుకోతగ్గ ప్రభావాన్ని  చూపింది. ఈ కోర్సు ముగిసిన అనంతరం వారు కోర్సు పూర్తి చేసినట్లుగా ఓ గుర్తింపు లేఖను కూడా  అందుకుంటారు. ఈ కార్యక్రమం ద్వారా  నిపుణులతో ప్రత్యక్ష మాస్టర్‌క్లాస్‌లను సైతం అందించడంతో పాటుగా ట్రెండ్స్‌పై తాజా సమాచారం, ప్రొడక్ట్‌ అప్‌డేట్స్‌, సవాళ్లను సైతం తెలుపడం ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌పై తాజా అంశాలను సైతం వెల్లడించనున్నారు. 

Facebook outlines
Facebook outlines

చివరగా, ఇది క్రియేటర్లకు  ద్రవ్య అవకాశాలను పొందే అవకాశాన్ని పలు రివార్డులు, బ్రాండ్‌ భాగస్వామ్యాల ద్వారా అందిస్తుంది. దీనిలో చేరేందుకు  www.bornoninstagram.com   చూడవచ్చు.భారతదేశంలో క్రియేటర్‌  వ్యవస్థ పట్ల కంపెనీ,నిబద్ధతకు నిదర్శనంగా ఈ నూతన క్రియేటర్‌ ఎడ్యుకేషన్‌ కార్యక్రమం ఉండటంతో  పాటుగా సంవత్సరమంతటా జరిగిన ఈ ప్రొడక్ట్‌పై జరిగిన అనేక అంశాలను పునరావృతం చేస్తుంది. ఉదాహరణకు  ‘రీమిక్స్‌  ఆన్‌ రీల్స్‌’  ప్రారంభించడం. ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్లు తమ రీల్స్‌ను ఫేస్‌బుక్‌పై సిఫార్సు చేయగలిగే సామర్థ్యం, ఫేస్‌బుక్‌పై రీల్స్‌ సృష్టించే వ్యక్తుల కోసం  భారతదేశంలో మొట్టమొదటి సారిగా ఉత్పత్తులను పరీక్షించే ప్రక్రియ, ‘కొల్లాబ్‌’ పరిచయం. ఇక్కడ కూడా  ప్రపంచవ్యాప్తంగా పరీక్షించిన  మొట్టమొదటి దేశాలలో ఇండియా ఒకటిగా నిలిచింది.

error: Content is protected !!