hrithik-roshan-hous_365TELUGU

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మార్చి17, 2023: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ ఏడాది అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తుల జాబితాలో హృతిక్ రోషన్ చేరిపోయాడు.

హృతిక్ రోషన్ బాలీవుడ్‌లో “కహో నా ప్యార్‌ హై” సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటివరకూ హృతిక్ 30 సినిమాల్లో నటించాడు.

“క్రిష్” వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో తనదైన మార్కు వేశాడు. హృతిక్ రోషన్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రాకేష్ రోషన్ కొడుకు. ఆయన దగ్గర హృతిక్ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పనిచేశాడు.

3వేలకోట్ల ఆస్తి..

hrithik-roshan-hous_365TELUGU

నివేదికల ప్రకారం హృతిక్ రోషన్ మొత్తం 3వేల కోట్ల ఆస్తికి యజమాని. ఒక సినిమాకు కనీసం 35 నుంచి 70 కోట్లు తీసుకుంటారు. అలాగే పబ్లిసిటీ కోసం 8 నుంచి 10 కోట్లు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తన రాబోయే చిత్రం ఫైటర్ గురించిన ప్లాన్ లో ఉన్నాడు.

ఖరీదైన వాహనాలు..

బాలీవుడ్ నటుల ఇళ్లలో అత్యంత ఖరీదైన ఇల్లు నటుడు హృతిక్ రోషన్ ది. ముంబైలోని జుహు వెర్సోవా లింక్ రోడ్‌లో ఇల్లు ఉంది. అతని ఇల్లు 38,000 చదరపు అడుగులలో నిర్మించారు. ఈ ఇంటి ఖర్చు దాదాపు 100 కోట్లు.

అంతేకాదు హృతిక్ విలాసవంతమైన ఇంట్లో 10కి పైగా కార్ల పార్కింగ్ స్థలం ఉంది. నటుడికి లగ్జరీ వాహనాలంటే చాలా ఇష్టం. అతని దగ్గర10కి పైగా ఖరీదైన వాహనాలున్నాయి. రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ 2 ఉంది. దీని ఖరీదు 7 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఆడి, మెర్సిడెస్ , పోర్షే వంటి బ్రాండ్ల వాహనాలు కూడా ఉన్నాయి.

విలాసవంతమైన వాచీలంటే చాలా ఇష్టం..

ఖరీదైన వాహనాలతో పాటు విలాసవంతమైన వాచీలంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర లగ్జరీ వాచెస్ కలెక్షన్ కూడా ఉంది. నటుడు తన లుక్స్, స్టైల్‌ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. అందుకే ఆయన ఎప్పుడూ స్టైల్‌గా కనిపిస్తాడు.

hrithik-roshan-hous_365TELUGU

రోలెక్స్ సబ్‌మెరైనర్ డేట్ వంటి వాచీలు ఉన్నాయి. దీని ధర 7.5 లక్షలు. ఒక ఇంటర్వ్యూలో తన గడియారాల సేకరణ గురించి మాట్లాడాడు. కార్టియర్, రాడో, జేగర్-లుకల్టర్ వంటి బ్రాండ్‌లకు చెందిన వాచీలు తన వద్ద ఉన్నాయని వెల్లడించాడు.

48 ఏళ్ల నటుడు హృతిక్ రోషన్ తన ఫిట్‌నెస్‌పై చాలా శ్రద్ధ చూపుతాడు. బాలీవుడ్‌లోని ఫిట్‌టెస్ట్ సెలబ్రిటీలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. 2013 సంవత్సరంలో HRX బ్రాండ్‌ను ప్రారంభించాడు.

ఈ బ్రాండ్ ఫిట్‌నెస్ ఉపకరణాలు, పాదరక్షలు, దుస్తులు వంటి వాటిని తయారు చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా.